AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ మేమే గెలుస్తాం ‘.. జార్ఖండ్ సీఎం రఘువర దాస్ ధీమా

ఝార్ఖండ్ లో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ వెనుకబడింది. చూడబోతే కమలం పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులవచ్ఛునని తెలుస్తోంది. అయితే తాము విజయం సాధించి తీరుతామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం, బీజేపీ నేత రఘువర్ దాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జంషెడ్ పూర్ ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన తన సమీప ప్రత్యర్థికన్నా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ‘ అబ్ […]

' మేమే గెలుస్తాం '.. జార్ఖండ్ సీఎం రఘువర దాస్ ధీమా
Anil kumar poka
| Edited By: |

Updated on: Dec 23, 2019 | 2:55 PM

Share

ఝార్ఖండ్ లో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ వెనుకబడింది. చూడబోతే కమలం పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులవచ్ఛునని తెలుస్తోంది. అయితే తాము విజయం సాధించి తీరుతామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం, బీజేపీ నేత రఘువర్ దాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జంషెడ్ పూర్ ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన తన సమీప ప్రత్యర్థికన్నా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ‘ అబ్ కీ బార్ 65 పర్ ‘ అనే స్లోగన్ ని ఎత్తుకుంది. కానీ ఝార్ఖండ్ ముక్తి మోర్చా- కాంగ్రెస్ కూటమి నుంచి ఊహించని ‘ దెబ్బ ‘ ను ఎదుర్కొంటోంది.

ఝార్ఖండ్ లో బీజేపీ, జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలతో బాటు ఆర్జేడీ, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, ఝార్ఖండ్ వికాస్ మోర్చా ప్రజా తాంత్రిక్ వంటి పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ.. ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ తో పొత్తు పెట్టుకుంది. (ఈ పార్టీ 5 సీట్లు గెలుచుకుంది). అయితే ఈ సారి జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్..బీజేపీతో పొత్తు వదులుకుని ఒంటరిగా బరిలోకి దిగింది. అటు- ఈ ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తున్నట్టు వార్తలు రావడంతో ముఖ్యంగా కాంగ్రెస్ శిబిరాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Follow Us
శని దోషం తగ్గాలంటే గుర్రపు నాడా ఉంగరం ఇలా ధరించాలట!
శని దోషం తగ్గాలంటే గుర్రపు నాడా ఉంగరం ఇలా ధరించాలట!
రూ.2 వేలలోపు ధరల్లో boAt నుంచి బెస్ట్ ఇయర్ బడ్స్
రూ.2 వేలలోపు ధరల్లో boAt నుంచి బెస్ట్ ఇయర్ బడ్స్
నార్మల్ రైస్‌తో అదిరిపోయేలా దమ్ బిర్యానీ..
నార్మల్ రైస్‌తో అదిరిపోయేలా దమ్ బిర్యానీ..
టెలివిజన్ 24 క్రాఫ్ట్స్‌తో ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ చర్చలు
టెలివిజన్ 24 క్రాఫ్ట్స్‌తో ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ చర్చలు
ల్యాండ్‌ అవుతుండగా ఊడిన విమానం టైర్.. రన్‌వే పై భీకర టెన్షన్
ల్యాండ్‌ అవుతుండగా ఊడిన విమానం టైర్.. రన్‌వే పై భీకర టెన్షన్
రక్తహీనత పోగొట్టి ఎముకల బలం పెంచే సంప్రదాయ సజ్జ బూరెలు..
రక్తహీనత పోగొట్టి ఎముకల బలం పెంచే సంప్రదాయ సజ్జ బూరెలు..
నక్షత్రంలా కనిపించే ఈ పండు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
నక్షత్రంలా కనిపించే ఈ పండు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
వయసు పెరిగినా మెమరీ తగ్గొద్దా? ఈ విషయాలు మర్చిపోవద్దు!
వయసు పెరిగినా మెమరీ తగ్గొద్దా? ఈ విషయాలు మర్చిపోవద్దు!
సుందరకాండ పారాయణం ఇలా చేస్తే హనుమంతుడి అనుగ్రహం లభిస్తుందట.. శుభ
సుందరకాండ పారాయణం ఇలా చేస్తే హనుమంతుడి అనుగ్రహం లభిస్తుందట.. శుభ
'ది ప్యారడైజ్' సినిమాకు నెగెటివ్ రివ్యూలు, హీరో నాని ఏమన్నారంటే?
'ది ప్యారడైజ్' సినిమాకు నెగెటివ్ రివ్యూలు, హీరో నాని ఏమన్నారంటే?