బీహార్‌ను స్కాట్లాండ్‌గా మారుస్తా..! అసెంబ్లీ ఎన్నికల ముందు తేజస్వి యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తాను ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు. ఇండియా కూటమిలోనూ ఈ విషయంలో ఏకాభిప్రాయం ఉందని ఆయన పేర్కొన్నారు. మహా కూటమి ప్రభుత్వం ఏర్పడితే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఒక భారీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని, ఈ విషయంలో ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం సైతం ఉందని అన్నారు. బీహార్‌లో తమ ప్రభుత్వం ఏర్పడబోతోంది. మా ప్రభుత్వం ఏర్పడితే, మేం రాష్ట్రాన్ని స్కాట్లాండ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నాయకులందరూ చింటూలే అని, బీహార్‌లో కుల-మత రాజకీయాలు జరగనివ్వమంటూ స్పష్టం చేశారు.
RJD నుండే సీఎం..
అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్బంధన్ కు మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి ఆర్జేడీ నుంచి వస్తారని కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ అన్నారు. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి ముఖం అవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ నుంచి ముఖ్యమంత్రి వస్తారు. మహాఘట్బంధన్ లో ఆర్జేడీ అతిపెద్ద పార్టీ, దానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి కూడా వారి పార్టీ నుంచే ఉంటారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్‌లో రాజకీయ వేడి ఇప్పటికే పెరిగింది. అనేక అంశాలపై అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ రోజు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే ముందు, తేజస్వి యాదవ్ ఆదివారం ఇచ్చిన స్టేట్‌మెంట్ సంచలనంగా మారింది. బీహార్‌లో ఎన్డీఏ అధికారం కోల్పోబోతోందని, మహాఘటబంధన్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వక్ఫ్ చట్టాన్ని చెత్తబుట్టలో వేస్తామని కూడా తేజస్వి యాదవ్ అన్నారు. ఆర్జేడీ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తుందని మా జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారని తెలిపారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా మేం కోర్టును కూడా ఆశ్రయించాం. బీహార్‌లోని ముస్లిం సోదరులు ఎన్డీఏ ప్రభుత్వం పోతుందని గుర్తుంచుకోవాలని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




