Sankranti Tragedy: పండగపూట గుడికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి!
సంక్రాంతి పండగ పూట మధ్య ప్రదేశ్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది.రాష్ట్ర రాజధాని భోపాల్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వ్యాన్-ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు. మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్ని మృతదేహాలనూ స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంక్రాంతి పండగ వేళ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ తీవ్ర విషాదం వెలుగు చూసింది. నగరంలో గురువారం ఉదయం వ్యాన్-ట్రాక్టర్ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. మరో 10 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అలాగే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌లో చేర్చారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని సిరోజ్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు మకర సంక్రాంతి పండగ సందర్భంగా నర్మదాపురంలోని గుడికి వెళ్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం భోపాల్ జిల్లా బెరాసియా ప్రాంతం వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ అదుపు తప్పి వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారికి స్థానిక హమీదియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మహిళలు, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదంలో మరణించిన వారంతా సిరోజ్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే రోడ్డుపై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు సైడ్‌ల నుంచి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.. దీంతో పోలీసులు రోడ్డుపై ఉన్న రెండు వాహనాలను క్రెయిన్ సహాయంతో పక్కకు తొలగించింది. ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
