AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holidays: అక్కడ జనవరి 20వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు!

School Holidays: జనవరి 20 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ఆ రాష్ట్ర అధికారులు. ఎందుకంటే సంక్రాంతి పండగ కారణంగా, అలాగే మౌని అమావాస్య కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో చలి తీవ్రత కారణంగా పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

School Holidays: అక్కడ జనవరి 20వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు!
School Holidays
Subhash Goud
|

Updated on: Jan 15, 2026 | 9:15 PM

Share

School Holidays: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో 12వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలు జనవరి 20 వరకు మూసి వేయనున్నారు. జనవరి 16 నుండి జనవరి 20 వరకు అన్ని పాఠశాలలను మూసివేయాలని డిఎం నిర్ణయించారు. మకర సంక్రాంతి, మౌని అమావాస్య స్నానాలకు ప్రయాగ్‌రాజ్‌లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 1 నుండి 12వ తరగతి వరకు ఉన్న అన్ని బోర్డుల పాఠశాలలు జనవరి 16 నుండి జనవరి 20 వరకు సెలవులు ప్రకటించారు. డిఎం మనీష్ కుమార్ వర్మ సూచనల మేరకు డిఐఓఎస్ పిఎన్ సింగ్ ఈ ఉత్తర్వు జారీ చేశారు. రద్దీ, ట్రాఫిక్ పరిమితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Indigo Offer: 1 రూపాయికే విమాన టికెట్‌.. ఇండిగో బంపర్‌ ఆఫర్‌.. షరతులు వర్తిస్తాయ్‌..!

జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన ఉత్తర్వులో ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మాఘమేళా ప్రధాన స్నానోత్సవాలు, మకర సంక్రాంతి, మౌని అమావాస్యల కారణంగా రద్దీ, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యార్థుల భద్రత దృష్ట్యా, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశానికి అనుగుణంగా జిల్లాలోని అన్ని బోర్డులలోని అన్ని మాధ్యమిక పాఠశాలలు జనవరి 16, 2026 నుండి జనవరి 20, 2026 వరకు 1 నుండి 12 తరగతులకు మూసివేయనున్నారు.

EPFO: మీ జీతం 30,000కి చేరుకుంటే ఎంత పెన్షన్ లభిస్తుంది?

అలాగే రాష్ట్రంలోని గౌతమ్ బుద్ధ నగర్‌తో సహా అనేక జిల్లాల్లో తీవ్రమైన చలి కారణంగా, జనవరి 17 వరకు అనేక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఆన్‌లైన్‌ తగరతులు నిర్వహించనున్నారు.

UPI Payments: ఇంటర్నెట్ లేకుండా కీప్యాడ్ ఫోన్‌తో UPI పేమెంట్స్ చేయడం ఎలా?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి