AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wayanad bypoll result: రికార్డులు బద్దలు కొడుతోన్న ప్రియాంక.. ఇందిరమ్మ మనవరాలికి వయనాడ్ పట్టాభిషేకం

వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాలు ప్రియాంక గాంధీ వాద్రా దూసుకుపోతున్నారు. 5 లక్షల మెజార్టీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ప్రియాంక.. ఆ టార్గెట్ రీచ్ అయ్యేలానే వీరవిహారం చేస్తున్నారు. రౌండ్.. రౌండ్‌కి ఆమె ఆధిక్యత పెరుగుతూ పోతుంది.

Wayanad bypoll result: రికార్డులు బద్దలు కొడుతోన్న ప్రియాంక.. ఇందిరమ్మ మనవరాలికి వయనాడ్ పట్టాభిషేకం
Priyanka Gandhi - indira gandhi
Ram Naramaneni
|

Updated on: Nov 23, 2024 | 1:52 PM

Share

తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంక గాంధీ వాద్రా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. ఈ వార్త రాస్తున్న సమయానికి కేరళలోని వయనాడ్‌ పార్లమెంట్ స్థానంలో ఆమె మెజార్టీ ప్రస్తుతం 4 లక్షలు దాటింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీ  4.03 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  ఆమె తర్వాతి స్థానాల్లో సీపీఐ అభ్యర్థి సత్యన్‌ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఉన్నారు.

వయనాడ్‌‌లో గెలవడం కాదు.. ఏకంగా 5 లక్షల మెజారిటీ రావాలనే లక్ష్యంతో ప్రచారం చేశారు. స్వయంగా సోనియా గాంధీనే ప్రచారానికి వచ్చారు. వయనాడ్‌ ఉప ఎన్నికలో మొత్తం 16 మంది అభ్యర్ధులు పోటీకి దిగారు. 16 మంది పోటీలో ఉన్నా.. అదంతా నామమాత్రమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకు తగ్గట్టే.. భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు ప్రియాంక. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3 లక్షల మెజార్టీతో రాహుల్‌ గెలిచిన రాహుల్..  మొన్నటి ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి  సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3 లక్షల 60వేల మెజారిటీతో గెలిచారు రాహుల్‌గాంధీ. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. పైగా ప్రియాంకగాంధీ మొదటిసారి ఎన్నికల బరిలో ఉండడంతో.. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా వయనాడ్‌లో ప్రియాంక ఈజీ విక్టరీ సాధిస్తారని తేల్చాయి. ఇప్పటికే.. వయనాడ్‌ లోక్‌సభ స్థానం గాంధీల కంచుకోటగా మారిపోయిందన్న చర్చ జరుగుతోంది. 2019లో రాహుల్‌గాంధీ గెలిచారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ మరోసారి రాహుల్‌గాంధీ గెలిచారు. అయితే.. రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీలో కూడా గెలవడంతో.. వయనాడ్‌ను వదులుకున్నారు. ఇప్పుడు ఆ స్థానానికి పోటీ చేశారు ప్రియాంక గాంధీ.

ప్రస్తుతం గాంధీ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్‌ పార్టీని నడిపిస్తున్నది రాహుల్‌గాంధీ ఒక్కరే. అనారోగ్య కారణాల వల్ల సోనియాగాంధీ క్రియాశీలకంగా ఉండడం లేదు. అప్పటి నుంచి రాహుల్ ఒక్కరే పార్టీని నడిపిస్తున్నారు. రాహుల్‌గాంధీకి సపోర్ట్‌గా ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చారు ప్రియాంకగాంధీ. 2019లోనే ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు ప్రియాంక. ఇప్పుడు వయనాడ్‌ స్థానం నుంచి లోక్‌సభలో అడుగుపెట్టాలనుకుంటున్నారు.

ప్రియాంకగాంధీ గెలుపు దాదాపు ఖాయమైనట్టే. ఇక తేలాల్సింది ఎంత మెజారిటీ వస్తుందనే. ప్రియాంక గెలుపుతో ఓ కాంబినేషన్‌ సెట్ అయినట్టు కనిపిస్తోంది. ఉత్తరాదిన అన్నయ్య రాహుల్‌గాంధీ, దక్షిణాదిన చెల్లెలు ప్రియాంకగాంధీ. ఈ ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీని నడిపించబోతున్నారంటూ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తరాదిన పార్టీపై రాహుల్‌గాంధీ ఫోకస్‌ పెడితే.. దక్షిణ భారతంలో ప్రియాంకగాంధీ పార్టీని లీడ్‌ చేస్తారని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!