Himachal Pradesh: మంచుకురిసే వేళలో..సైనికుల ఆటవిడుపు.. కబడ్డీ .. కబడ్డీ అంటూ పోటీపడిన జవాన్లు

Himachal Pradesh: దేశ రక్షణ కోసం సరిహద్దుల వద్ద నిరంతరం విధులు నిర్వహించే సైనికులు.. కొంచెం సేపు సరదాగా ఆటవిడుపుగా గడిపారు. దట్టమైన మంచు కురుస్తుండగా కబడ్డీ.. కబడ్డీ(Kabaddi) అంటూ.. కబడ్డీ ఆట ఆడారు. ఈ..

Himachal Pradesh: మంచుకురిసే వేళలో..సైనికుల ఆటవిడుపు.. కబడ్డీ .. కబడ్డీ అంటూ పోటీపడిన జవాన్లు
Indo Tibetan Border Police
Follow us
Surya Kala

|

Updated on: Mar 13, 2022 | 1:47 PM

Himachal Pradesh: దేశ రక్షణ కోసం సరిహద్దుల వద్ద నిరంతరం విధులు నిర్వహించే సైనికులు.. కొంచెం సేపు సరదాగా ఆటవిడుపుగా గడిపారు. దట్టమైన మంచు కురుస్తుండగా కబడ్డీ.. కబడ్డీ(Kabaddi) అంటూ.. కబడ్డీ ఆట ఆడారు. ఈ సరదాగా సంఘటన ఇండో-టిబెటన్ బోర్డర్(Indo-Tibetan Border)వద్ద చోటు చేసుకుంది.  52 సెకన్ల వీడియో క్లిప్ ఇప్పడు నెటిజన్లను అలరిస్తుంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు రేఖ వద్ద ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది ఖాళీ సమయాల్లో కబడ్డీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పర్వత ప్రాంతాలలో మన దేశాన్ని రక్షించే సైనికుల  కబడ్డీ కబడ్డీ అంటూ కూతపెడుతూ పోటీపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలలో ITBP సిబ్బంది బరువైన ఉన్ని దుస్తులు ధరించి కబడ్డీ ఆట ఆడారు.  సరిహద్దు రేఖ వద్ద కొంచెం సేపు వారు సంతోషంగా గడిపారు.

మంచులో కబడ్డీ ఆటను ఆస్వాదిస్తున్న తమ సిబ్బంది వీడియోను ఐటీబీపీ షేర్ చేసింది.  ITBP “ఫుల్ ఆఫ్ జోష్, ప్లేయింగ్ ఇన్ స్నో” అని  వీడియోకి క్యాప్షన్ జత చేసింది. #FitnessMotivation , #FitIndia వంటి హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Also Read: Viral Video: పాములు నీళ్లు తాగుతాయా?.. సమాధానం కావాలంటే ఈ వైరల్‌ వీడియో చూడాల్సిందే..

Most Venomous Snakes: ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములు.. ఇవి కాటేస్తే.. కేవలం నిమిషాల్లోనే మరణం తథ్యం