AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చేసిందే తప్పు.. పైగా అధికారులపై చిందులు.. రైల్వేస్టేషన్‌లో యువకుడు ఏం చేశాడో చూడండి!

రైల్వే స్టేషన్‌లో జరిగిన రచ్చకు సంబంధించిన ఒక షాకింగ్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలోని బొరివలి రైల్వే స్టేషన్‌లో ఒక యువకుడు అధికారులపై రెచ్చిపోయాడు. టికెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా.. ప్రశ్నించిన అధికారులపై దాడికి యత్నించాడు. టికెట్‌ కౌంటర్‌లోని కంప్యూటర్, వస్తులను ధ్వంసం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిందితుడిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

Viral Video: చేసిందే తప్పు.. పైగా అధికారులపై చిందులు.. రైల్వేస్టేషన్‌లో యువకుడు ఏం చేశాడో చూడండి!
Maharastra News
Anand T
|

Updated on: Aug 03, 2025 | 2:48 PM

Share

టికెట్‌ తీసుకోకుండా ట్రైన్‌లో ప్రయాణించడమే కాకుండా.. టికెట్‌ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించిన అధికారులపై ఒక యువకుడు రెచ్చిపోయిన ఘటన ముంబైలోని బొరివలి రైల్వే స్టేషన్‌లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిందితుడిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విరార్ ఫాస్ట్ లోకల్ రైలులో సెకండ్ క్లాస్ టికెట్‌పై ఫస్ట్ క్లాస్ కోచ్‌లో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు పట్టుబడ్డారు. వారిలో ఒక ప్రయాణికుడి వద్ద అంధేరి నుంచి బోరివలి వెళ్లాల్సిన టికెట్ లేదు.దీంతో వారిని నెక్ట్స్‌ వచ్చే బొరివలి స్టేషన్‌లో దింపి టీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ టటికెట్‌ ఎందుకు తీసుకోలేదని సదురు యువకుడిని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన యువకుడు సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా టికెట్‌ కౌంటర్‌లో ఉన్న కంప్యూటర్లు, కీబోర్డులును ధ్వంసం చేశాడు.

సదురు యువకుడి దాడిలో పలువురు అధికారులు గాయపడినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌ వీడియో ప్రకారం.. ఎల్లో కలర్‌ కుర్తా ధరించిన ఒక యువకుడు అధికారులపై అరుస్తూ.. ఆఫీస్‌లోని కంప్యూటర్‌, కీబోర్డ్స్‌ను ధ్వంసం చేయడం మనం స్పష్టంగా చూడవచ్చు.

స్థానిక రైల్వే సిబ్బంది సమాచారంతో ఘటన గురించి తెలుసుకున్న రైల్వే ప్రొలక్షన్ ఫోర్స్‌ నిందితులను అదుపులోకి తీసుకుని, గవర్నమెంట్ రైల్వే పోలీసులకు (జీఆర్పీ) అప్పగించారు. ఈ మేరకు అధికారుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..