Vikas Dubey Encounter: వికాస్ దూబే ఎన్‌కౌంటర్ కేసులో.. యూపీ పోలీసులకు క్లీన్‌చిట్.. కమిటీ ఏమన్నదంటే..?

UP Police: ఉత్తరప్రదేశ్‌లో గతేడాది వికాస్ దూబే గ్యాంగ్ ఎనిమిది మంది పోలీసులను దారుణంగా చంపిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టార్ వికాస్ దూబే

Vikas Dubey Encounter: వికాస్ దూబే ఎన్‌కౌంటర్ కేసులో.. యూపీ పోలీసులకు క్లీన్‌చిట్.. కమిటీ ఏమన్నదంటే..?
Vikas Dubey
Follow us

|

Updated on: Apr 21, 2021 | 11:43 AM

UP Police: ఉత్తరప్రదేశ్‌లో గతేడాది వికాస్ దూబే గ్యాంగ్ ఎనిమిది మంది పోలీసులను దారుణంగా చంపిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టార్ వికాస్ దూబే హతమయ్యాడు. ఈ సంఘటన గతేడాది జూలైలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వికాశ్ దూబే ఎన్‌కౌంట‌ర్‌ అనంతరం అది బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్ అంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. యూపీ ప్రభుత్వం పలు విషయాలను దాచేందుకు ఇలా చేసిందంటూ విపక్షలు ఆరోపించాయి. దీనిపై సుప్రీం కోర్టు కూడా స్పందించి.. విచారణ చేయాలని క‌మిటీను నియమించింది. ఈ కమిటీ తాజాగా నివేదిక‌ను స‌మ‌ర్పించింది. జ‌స్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని ఎంక్వైరీ క‌మిష‌న్ త‌న నివేదిక‌లో ఆ ఎన్‌కౌంటర్‌కు వ్య‌తిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది.

యూపీలో వికాస్ దూబేను ప‌ట్టుకునేందుకు వెళ్లిన స‌మ‌యంలో ఆయన అనుచరులు కాల్పులు జరిపి ఎనిమిది మంది పోలీసులను దారుణంగా హత్యచేశారు. ఆ త‌ర్వాత ప‌రారీ అయిన వికాస్ దూబేను మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ క్రమంలో ఉజ్జ‌యిని నుంచి యూపీకి తీసుకువ‌స్తున్న స‌మ‌యంలో పోలీసుల వాహ‌నం బోల్తా ప‌డింది. ఆ వాహ‌నంలో ఉన్న వికాశ్ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేయగా.. పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దూబే ఎన్‌కౌంటర్ ప‌ట్ల మీడియాతో పాటు స్థానికుల నుంచి పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో వికాస్ దూబేతో పాటు మ‌రో అయిదుగురు అనుచ‌రుల్ని పోలీసులు హ‌త‌మార్చారు. అయితే.. ఈ ఎన్‌కౌంట‌ర్ విషయంలో పోలీసుల‌కు వ్య‌తిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవ‌ని కమిటీ స్పష్టంచేసింది.

ముందుగా విమర్శలు వచ్చినట్లుగా ఆ తరువాత స‌మాచారం లభించలేదని కమిటీ నివేదికలో వెల్లడించింది. ఎన్‌కౌంట‌ర్‌ను తప్పుప‌డుతూ ఎవ‌రూ ఆధారాలు స‌మ‌ర్పించ‌లేద‌ని జ‌స్టిస్ చౌహాన్ త‌న నివేదిక‌లో వెల్లడించారు. సాక్ష్యాలను సేకరించేందుకు తమవంతు ప్రయత్నం చేశామని, కానీ ఎవరూ ముందుకు రాలేదని చౌహాన్ అభిప్రాయపడ్డారు.

Also Read:

india Covid-19: ఒక్కరోజే మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు.. రెండు వేల మార్క్ దాటిన మరణాల సంఖ్య

Remdesivir: కరోనా బాధితులను దోచుకుంటున్న అక్రమార్కులు.. నీళ్లు పోసి రెమిడెసివిర్ అంటూ అమ్మకాలు..