AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Remdesivir: కరోనా బాధితులను దోచుకుంటున్న అక్రమార్కులు.. నీళ్లు పోసి రెమిడెసివిర్ అంటూ అమ్మకాలు..

Remdesivir - Water: కరోనావైరస్‌ మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కోవిడ్ బారిన పడుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంటోంది. దీంతో

Remdesivir: కరోనా బాధితులను దోచుకుంటున్న అక్రమార్కులు.. నీళ్లు పోసి రెమిడెసివిర్ అంటూ అమ్మకాలు..
Remdesivir Vial
Shaik Madar Saheb
|

Updated on: Apr 21, 2021 | 9:26 AM

Share

Remdesivir – Water: కరోనావైరస్‌ మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కోవిడ్ బారిన పడుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంటోంది. దీంతో వారంతా వైద్యంలో కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ తరుణంలో చాలాచోట్ల ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. అంతేకాకుండా కరోనా చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్ ఔషధం కూడా లభించడం లేదు. దీంతో చాలామంది బాధితులు పరిస్థితి విషమించి మరణిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా బాధితుల అవసరాన్ని ఆసరగా చేసుకొని.. వారికి సహాయం చేస్తామని చెప్పి దోచుకుంటున్నారు అక్రమార్కులు. అసలు మందు లేకుండానే నీటిని నింపి ఇదే రెమిడెసివిర్ ఔషధమని నమ్మించి క్యాష్ చేసుకుంటున్న ఇద్దరు నిందితులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ సక్కరదర ప్రాంతంలో జరిగింది.

అభిలాష్ పేట్కర్(28), అంకిత్ నందేశ్వర్(21) అనే ఇద్దరూ ఓ ఆసుపత్రిలో ఎక్స్ రే టెక్నిషియన్లుగా పనిచేస్తున్నారు. వారి బంధువు ఒకరు నాగ్‌పూర్ కొవిడ్-19 ఫెసిలిటీలో జాయిన్ అయ్యాడు. అతనికి అవసరం ఉందని తెలుసుకొని మొదట కుటుంబసభ్యులకు రెమిడెసివిర్ డ్రగ్ ను బ్లాక్‌లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనికోసం మొదటి బాటిల్ ను రూ.40 వేలకు, రెండో బాటిల్‌ను రూ.28వేలకు అమ్మారు. ఆ బాటిల్స్‌పై అనుమానం రావడంతో బాధితుని బంధువు ఒకరు పోలీసులను సంప్రదించారు.

వెంటనే రంగంలో రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని ట్రాప్ చేసి పట్టుకున్నారు. అనంతరం వారిని విచారించి.. న్యూ సుబేదార్ లే అవుట్, మానెవాడాలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సక్కరదర పోలీసులు తెలిపారు. ఖాళీ బాటిళ్లల్లో నీటిని నింపి విక్రయిస్తున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి సత్యమాన్ మానే వెల్లడించారు.

Also Read:

Plasma Therapy: ప్లాస్మా అంటే ఏమిటి.. కరోనా పేషేంట్స్ చికిత్స కు ఎందుకు ఉపయోగిస్తారంటే..

Criminal: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బాత్రూమ్ కిటికీ నుంచి దూకిన నేరస్థుడు.. ఆ తర్వాత ఏమైందంటే..?