Video: హెలికాప్టర్ లాండింగ్ సమయంలో గాలి దుమారం.. మాజీ సీఎంకు తప్పిన ప్రమాదం..
సమయంలో ఆకస్మాత్తుగా గాలిదుమారం వచ్చింది. దీంతో హెలికాప్టర్ ల్యాండింగ్ చేయలేకపోయాడు పైలెట్ . గాలిలో కాసేపు చక్కర్లు కొట్టిన తరవాత తిరిగి ఆ హెలికాప్టర్ వెళ్లిపోయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో..
కర్నాటక మాజీ సీఎం యడియూరప్ప హెలికాప్టర్‌కు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. కలబుర్గి జిల్లా జెవార్జీ దగ్గర హెలికాప్టర్ ల్యాండవుతున్న సమయంలో ఆకస్మాత్తుగా గాలిదుమారం వచ్చింది. దీంతో హెలికాప్టర్ ల్యాండింగ్ చేయలేకపోయాడు పైలెట్ . గాలిలో కాసేపు చక్కర్లు కొట్టిన తరవాత తిరిగి ఆ హెలికాప్టర్ వెళ్లిపోయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో జెవార్జీలో యడియూరప్ప హెలికాప్టర్ ల్యాండ్ కాలేదు. దీంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు యడియూరప్ప. కర్ణాటకలోని కాలబురగిలో సోమవారం (మార్చి 6) మధ్యాహ్నం పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా యడియూరప్ప పర్యటన అర్ధంతరంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. యడియూరప్పకు స్వాగతం పలికేందుకు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న వారందరూ వెనక్కి వెళ్లిపోయారు.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
#WATCH | Kalaburagi | A helicopter, carrying former Karnataka CM and senior leader BS Yediyurappa, faced difficulty in landing after the helipad ground filled with plastic sheets and waste around. pic.twitter.com/BJTAMT1lpr
— ANI (@ANI) March 6, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం