Vaccination: కరోనా టీకా 18 ఏళ్లు పైబడినవారికి ఒకటో తేదీన పారంభం అవుతుందా? రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా వున్నాయి?

కరోనా పై యుద్ధం.. వ్యాక్సిన్ ఆయుధం సిద్ధం అంటూ రెడీ అయిపొయింది కేంద్ర ప్రభుత్వం. మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామంటూ చెప్పింది.

Vaccination: కరోనా టీకా 18 ఏళ్లు పైబడినవారికి ఒకటో తేదీన పారంభం అవుతుందా? రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా వున్నాయి?
Follow us
KVD Varma

|

Updated on: Apr 30, 2021 | 10:24 PM

Vaccination: కరోనా పై యుద్ధం.. వ్యాక్సిన్ ఆయుధం సిద్ధం అంటూ రెడీ అయిపొయింది కేంద్ర ప్రభుత్వం. మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామంటూ చెప్పింది. దీనికోసం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి అందరూ కచ్చితంగా రిజిష్టర్ చేసుకోవాలంది ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా 2.45 కోట్ల మంది రిజిష్ట్రేషన్ చేయించుకున్నారు. అంతా బావుంది. మరి ఒకటో తారీఖూ వచ్చింది. ఇప్పడు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందా? అనేది సందేహాస్పదంగా మారింది. దీనికి కారణం టీకాల కొరత. 45 ఏళ్లు పైబడిన వారి రెండో డోసు కోసమే చాలా చోట్ల వ్యాక్సిన్ అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి రేపటి నుంచి 18 ఏళ్ల పైబడ్డ వారికీ టీకాలు అందుతాయా? మరి రాష్ట్రాలు ఏమంటున్నాయి. రాష్ట్రాలు డోసులు లేవు అని చెబుతున్నాయి. కేంద్రం కోటి డోసులు అందుబాటులో ఉన్నాయి అంటోంది. మరి కొన్ని రోజుల్లో ఇంకా వస్తాయి అంటోంది. మరి నిజం ఏమిటి? రాష్ట్రాలు ఏం చెబుతున్నాయి? ఏం చేయబోతున్నాయి?

తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లను అందించాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ‘‘ ఇది కేంద్రం బాధ్యత. భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపాం. అయితే, వ్యాక్సిన్ల లభ్యతపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థల నుంచి ఏదైనా సమాచారమొస్తే మూడో విడత వ్యాక్సినేషన్‌పై క్లారిటీ వస్తుంది అని చెప్పారు. అంటే.. ఇక్కడ వ్యాక్సినేషన్ ముందుకు సాగడం అనుమానమే.

ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మే ఒకటో తేదీ నుంచి మూడో విడత వ్యాక్సిన్ ప్రారంభం కావడం జరిగే పని కాదని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ కొరత ఉన్నట్టు చెప్పిన ఆయన పూర్తి స్థాయిలో టీకా పంపిణీ జరగడానికి కొన్ని రోజులు పట్టొచ్చని చెప్పారు.

కర్ణాటక మూడో విడత వ్యాక్సినేషన్‌పై కర్ణాటకలోనూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. శనివారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించడానికి అవసరమైనన్ని వయల్స్‌ రాష్ట్రంలో లేవని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు. ‘కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కోటి డోసులను ఆర్డర్‌ చేశాం. అయితే వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు ఇంకా వాటిని అందించలేదు. అందువల్ల 18-44 మధ్య వాళ్లు వ్యాక్సిన్‌ కోసం ఆస్పత్రులకు వెళ్లొద్దు. టీకాలు అందుబాటులోకి వచ్చాక సమాచారం ఇస్తాం అంటూ ఆయన ప్రకటించారు.

ఢిల్లీ ఢిల్లీలో పరిస్థితి ఘోరంగా ఉంది. రేపటి నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం చెప్పినప్పటికీ ఇక్కడ అది జరిగే పనిలా కనిపించడం లేదు. ఇప్పటికే టీకాల కోసం కేంద్రాల ఎదుట ఎవరూ బారులు తీర వద్దని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు.

మహారాష్ట్ర వెంటనే 25 నుంచి 30 లక్షల వ్యాక్సిన్‌ వయల్స్‌ రాష్ట్రానికి రాకపోతే మూడో విడత వ్యాక్సినేషన్‌ నిర్వహించడం సాధ్యం కాదని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే చెప్పేశారు. మరోవైపు వ్యాక్సిన్ల కొరత కారణంగా ముంబయి నగరకార్పొరేషన్‌ పరిధిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

గోవా మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడం కుదరదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామన్నారు. అదెప్పుడన్నది చెప్పలేమన్నారు.

మధ్యప్రదేశ్‌ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడం లేదని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు సకాలంలో డోసులను సరఫరా చేయలేకపోయినందున ఇది సాధ్యపడలేదన్నారు.

పశ్చిమ్‌బెంగాల్‌ కనీసం మూడు కోట్ల డోసులను సరఫరా చేయాల్సిందిగా పశ్చిమ్‌బెంగాల్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రభుత్వ ఆస్పత్రులకు 2 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు కోటి డోసులు సమకూర్చాలని కోరింది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న కోటి మందికి రెండు కోట్ల డోసులు అవసరమవుతాయని తెలిపింది.

పంజాబ్‌ పంజాబ్‌లో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వ్యాక్సిన్ల కొరత కారణంగా ఆలస్యమవుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌సింగ్‌ స్పష్టం చేశారు.

గుజరాత్‌ ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోనూ మూడో విడత వ్యాక్సినేషన్‌ మే 1న ప్రారంభం కావడం లేదు. అన్ని సజావుగా సాగితే మే 15 నుంచి 18 ఏళ్లు పూర్తయిన వారికి వ్యాక్సిన్‌ ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ స్పష్టం చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ కొరత తొ ఈ కార్యక్రమం ప్రారంభించలేం అని యూపీ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ప్రస్తుత నిల్వలు కేవలం 45 ఏళ్లు పైబడిన వారికే సరిపోతాయని స్పష్టం చేశారు.

ఇలా దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒకే రకంగా ఉన్నాయి. కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవడం కష్టంగానే కనిపిస్తోంది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!