ఏడు అడుగుల ధనియాల మొక్క.. గిన్నెస్ రికార్డు సాధించిన రైతు

ఏడు అడుగుల ధనియాల మొక్క.. గిన్నెస్ రికార్డు సాధించిన రైతు

సాధారణంగా ధనియాల మొక్క 2 లేదా మూడు అడుగుల ఎత్తు పెరుగుతుంది. కానీ ఓ రైతు మాత్రం ఏడు అడుగులు పెంచారు. దీంతో ఇప్పుడు గిన్నెస్ రికార్డు సాధించారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 11, 2020 | 11:52 AM

Tallest Coriander Plant : సాధారణంగా ధనియాల మొక్క 2 లేదా మూడు అడుగుల ఎత్తు పెరుగుతుంది. కానీ ఓ రైతు మాత్రం ఏడు అడుగులు పెంచారు. దీంతో ఇప్పుడు గిన్నెస్ రికార్డు సాధించారు. ( ఎస్వీబీసీలో పోర్న్‌ సైట్‌ లింక్ కలకలం.. వారందరిపై కఠిన చర్యలకు సిద్ధం)

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌ రాణిఖేత్‌ ప్రాంతానికి చెందిన గోపాల్‌ దత్‌ ఉప్రేటి అనే ఓ సివిల్ ఇంజనీర్‌.. తన ఉద్యోగాన్ని వదిలి కొన్ని సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. అక్కడ పలు రకాల పంటలను ఆయన పండిస్తున్నారు. వాటిలో ధనియాలు కూడా ఒకటి. ఆయన తోటలోని ధనియాల మొక్కలు చాలా వరకు ఐదు అడుగుల ఎత్తు ఉన్నాయి. ఇక మొక్క వాటికంటే మరింత ఎత్తుగా ఉండగా.. దాని ఎత్తును కొలిపించాడు. అది ఏడు అడుగుల ఒక అంగుళం ఉండగా.. 2020 ఏప్రిల్ 21న గిన్నిస్ బుక్‌ తన వెబ్‌సైట్‌లో ఇదే అతి పొడవైన ధనియాల మొక్క అని ప్రకటించింది. ( అనసూయకు మరో క్రేజీ ఆఫర్‌.. మాస్‌రాజా సినిమాలో..!)

కాగా ఆపిల్ చెట్లకు చీడపీడల బెడత తగ్గుతుందన్న ఉద్దేశ్యంతో గోపాల్‌ ధనియాల మొక్కలను అంతర పంటగా సాగు చేస్తున్నారట. తన తోటో పెరిగే ధనియాల మొక్కల్లోని మెరుగైన మొక్క విత్తనాలను ఆయన వేసేవారట. ఎత్తు పెరగడం కోసం కొమ్మలను కత్తిరిస్తూ వచ్చారట. దానికి ఎరువుగా వేపపిండి, జీవామృతంచ గడ్డీ గాదంను వేస్తూ వచ్చారట. ఇక ఒక్క మొక్క అర కేజీ వరకు ధనియాలను దిగుబడి ఇవ్వడం విశేషం. ( కోడలిగా మాకు హారిక ఓకే: అభిజిత్‌ తల్లిదండ్రులు)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu