లక్నో, సెప్టెంబర్ 28: ఎవరినైనా ఉద్దేశ్య పూర్వకంగా కేసుల్లో ఇరికించాలంటే పోలీసులు దొంగ కేసులు పెడతారు. లేదంటే డ్రగ్స్ లేదా మారణాయుధాలు వంటి వాటిని వాళ్లే స్వయంగా టార్గెట్ చేసిన వ్యక్తుల ఇళ్లలో పెట్టి నాటకాలు ఆడుతారు. సాధారణంగా ఇలాంటి సంఘటనలు సినిమాల్లోనో.. సీరియల్‌లలోనో జరుగుతుంది. ఆ తర్వాత సర్చె ఆపరేషన్ అంటూ ఇళ్లు, వాహనాలు తనికీ చేసి వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తుంటారు. ఇలాంటి సీన్లు మనం సినిమాల్లో చాలానే చూశాం. వారి మీద పగను సాధించడానికి పోలీసులు ఇలాంటి దొంగ ఎత్తులు వేస్తుంటారు. తాజాగా అటువంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడంతో అసలు బండారం బయటపడింది. దొంగ ఎత్తులు వేసి చివరికి పోలీసులే ఇరకాటంలో పడ్డారు. వివరాల్లోకెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో కూడా సేమ్ అలాంటి సీన్ ఒకటి జరిగింది. మీరట్‌లో నివాసం ఉంటోన్న అజిత్ త్యాగి అనే వ్యక్తి ఇంటికి కొందరు పోలీసులు వెళ్లారు. కొంతమంది వారి ఇంట్లోకి వెళ్లగా మరి కొంతమంది పోలీసులు అజిత్ త్యాగి బైక్ వద్ద తనిఖీలు చేశారు. అనంతరం పోలీసు బైక్‌లో నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నావంటూ హడావిడి చేసి సెప్టెంబర్ 26వ తేదీన అజిత్ త్యాగిని అరెస్ట్ చేశారు. అసలు బైక్‌లోకి తుపాకీ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు అజిత్ కుటుంబ సభ్యులు సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. అందులో రికార్డు అయిన ఫుటేజీని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. సెప్టెంబర్ 26న పోలీసులు ఇంటి డోర్ కొట్టే ముందు వాళ్లే బైక్‌లో తుపాకీ పెట్టడం వీడియోలో కనిపించింది.
In UP’s Meerut, a family alleged two cops from the local police station planted a gun in the house and later arrested a youth Ankit Tyagi under Arms Act. The family has produced CCTV footage as evidence to corroborate their claims.
First video is of a cop allegedly planting… pic.twitter.com/UM6OzaCkPq
— Piyush Rai (@Benarasiyaa) September 27, 2023
ఈ తర్వాత బాధితుడిని బయటకు పిలిచి తనిఖీ చేస్తున్నట్లు నాటకాలాడి గన్ బయటకు తీసి అరెస్ట్ చేశారు. దీంతో తమ కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ అశోక్ త్యాగి తల్లిదండ్రులు సీసీటీవీ ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా వెలుగులోకొచ్చింది. కొంతమందితో తమకు భూవివాదం ఉందని, పోలీసులు తమ ప్రత్యర్థులతో చేతులు కలిపి అక్రమంగా కేసులో ఇరికించారని, సీసీ టీవీ ఫుటేజీని తొలగించాలంటూ బెదిరిస్తున్నట్లు వాపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన మీరట్ ఎస్పీ దెహాత్ కమలేశ్ బహదూర్ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటన వెనుక ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నట్టు గుర్తించామని, అలా ఎందుకు చేశారో వారిని ప్రశ్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.