AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పెళ్లి సందడి.. తెల్లారేసరికల్లా మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించిన నవ వరుడు!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన కొన్ని గంటల్లోనే వరుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఖర్ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉల్ధాన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నవాబు కుమారుడు, 27 ఏళ్ల యూనస్‌కు పావ్లీ గ్రామానికి చెందిన అంజుమ్‌తో మంగళవారం వివాహం జరిగింది.

రాత్రి పెళ్లి సందడి.. తెల్లారేసరికల్లా మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించిన నవ వరుడు!
Kharkhoda News
Balaraju Goud
|

Updated on: Oct 08, 2026 | 5:27 PM

Share

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన కొన్ని గంటల్లోనే వరుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఖర్ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉల్ధాన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నవాబు కుమారుడు, 27 ఏళ్ల యూనస్‌కు పావ్లీ గ్రామానికి చెందిన అంజుమ్‌తో మంగళవారం వివాహం జరిగింది.

వివాహం అనంతరం రాత్రి సుమారు 10 గంటల సమయంలో పెళ్లి ఊరేగింపు ఉల్ధాన్ గ్రామానికి చేరుకుంది. నూతన వధూవరులకు కుటుంబ సభ్యులు, బంధువులు ఘనంగా స్వాగతం పలికారు. యూనస్ కూడా పెళ్లి పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి చేరుకున్న తర్వాత డాన్స్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడని చెప్పారు. అనంతరం అర్ధరాత్రి వరకు కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వివాహ వేడుకలు కొనసాగాయి.

బుధవారం (అక్టోబర్ 07) తెల్లవారుజామున యూనస్ ఫజ్ర్ నమాజ్ కోసం గ్రామంలోని గ్రాండ్ మసీదుకు వెళ్లాడు. నమాజ్ పూర్తయ్యాక ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే కొద్దిసేపటికే ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత సుమారు గంటకు గ్రామానికి సమీపంలోని సెట్కువా నివాసి తేజ్‌వీర్‌కు చెందిన మామిడి తోటలో ఓ యువకుడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని మృతుడు యూనస్‌గా గుర్తించారు. దీంతో పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఖర్ఖోడా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సమయ్ పాల్ అత్రి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రప్పించి సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అందుకు నిరాకరించారు.

ఎలాంటి చట్టపరమైన చర్యలు వద్దని, మృతదేహాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరారు. పోలీసులతో చర్చల అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం. యూనస్ ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us