చక్కెరను ‘వైట్ పాయిజన్’ అని పిలుస్తారు. చక్కెరలో క్యాలరీలు ఎక్కువ. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేసి బరువును పెంచుతుంది
TV9 Telugu
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంవల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి ‘టైప్-2 డయాబెటిస్’ కు కారణమవుతుంది
TV9 Telugu
అతిగా చక్కెర తీసుకోవడంవల్ల కాలేయంలో కొవ్వు చేరుతుంది. అతిగా చక్కెర తీసుకోవడంవల్ల చర్మం తన మెరుపును కోల్పోతుంది
TV9 Telugu
రక్తంలోని చక్కెర, ప్రోటీన్లతో కలిసి హానికరమైన అణువులను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్‌ను దెబ్బతీసి, చిన్న వయసులోనే ముడతలు వచ్చేలా చేస్తుంది
TV9 Telugu
మొటిమలు, చర్మ సంబంధిత అలర్జీలు కూడా పెరగవచ్చు. చక్కెరతోపాటు ఉప్పు కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి
TV9 Telugu
చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తిన్నప్పుడు వెంటనే శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ కాసేపటికే నీరసం, చిరాకు ఆవహిస్తాయి
TV9 Telugu
అధిక ఉప్పువల్ల నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తవచ్చు. చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉప్పు, చక్కెరలు అత్యధికంగా ఉంటాయి
TV9 Telugu
వీటిని వీలైనంత వరకు తగ్గించండి. ఏదైనా వస్తువు కొనే ముందు అందులో ఎంత సోడియం లేదా షుగర్ ఉందో గమనించండి