రాళ్లుగా మారిపోయిన అసురుడు, అతని వెంట వచ్చినవారు..
షరతును నెరవేర్చలేకపోవడంతో ఆ అసురుడు, అతడితో వచ్చినవారంతా రాళ్లుగా మారిపోయారని స్థానిక విశ్వాసం. గ్రామ పరిసర ప్రాంతాల్లో కనిపించే కొన్ని పెద్ద రాళ్లను ఈ గాథతో ముడిపెట్టి చూస్తారు. ఈ రాళ్లను గ్రామస్తులు పవిత్రమైనవిగా భావిస్తూ, వాటిని సాధారణ అవసరాలకు ఉపయోగించరని చెబుతారు. ఈ సంఘటన తర్వాత రేణుకా మాత అవివాహిత దేవతగానే నిలిచిపోయిందని స్థానిక గాథలో పేర్కొంటారు.
రేణుకా మాత అవివాహిత దేవత అనే స్థానిక విశ్వాసానికి గౌరవం ఇవ్వడమే గ్రామంలో పెళ్లిళ్లు నిర్వహించకపోవడానికి కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే వివాహ వేడుకలను గ్రామం వెలుపల ఉన్న మారుతి ఆలయం సమీపంలో నిర్వహించడం ఆనవాయితీగా మారింది. కాలం మారినా.. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని మాత్రం గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. ఒక దేవతపై భక్తి, స్థానిక గాథ, గ్రామ ఆచారం ఎలా కలిసిపోయి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక సంప్రదాయంగా మారాయో చెప్పడానికి చోంధాల గ్రామ కథ ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
(Disclaimer: ఈ కథనం చోంధాల గ్రామానికి సంబంధించిన స్థానిక ప్రజల విశ్వాసాలు, జానపద గాథలు, సంప్రదాయాల ఆధారంగా రూపొందించబడింది.)