AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

My Home Vyoma: మై హోమ్ వ్యోమా.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్ అడ్రస్..

అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్‌లో ప్రకృతి మధ్య గడపాలని చాలామందికి ఉంటుంది. అలాంటివారికి మంచి అనుభూతి అందించేందుకు మై హోమ్ వ్యోమా నిర్మాణమవుతోంది. నానక్ రామ్ గూడలో ఇది రూపుదిద్దుకుంటోంది. మీరు ఎన్నడూ చూడని అనేక అద్బుత సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి.

My Home Vyoma: మై హోమ్ వ్యోమా.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్ అడ్రస్..
My Home Vyoma
Venkatrao Lella
|

Updated on: Oct 08, 2026 | 5:32 PM

Share

హైదరాబాద్‌ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోంది. నగరం రోజురోజుకి విస్తరిస్తోంది. నగరంతో పాటు ఇక్కడ నివసించే ప్రజల జీవనశైలి, అభిరుచులు కూడా ఎప్పటికప్పడు మారుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఒక మంచి ఇల్లు ఉంటే కుటుంబంతో హాయిగా జీవించవచ్చని చాలామంది కలలు కంటుంటారు. ఒకప్పుడు ఇల్లు అంటే నాలుగు గోడలు అనుకునేవారు. కానీ ఇప్పుడు దానిని నిర్వచనం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్.. ఆ తర్వాత గేటెడ్ కమ్యూనిటీలో నివాసం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఇల్లు అంటే ఒక లైఫ్‌స్ట్రైల్‌గా మారిందని చెప్పవచ్చు. మంచి ఎక్స్‌పీరియన్స్, కమ్యూనిటీ, ప్యూచర్‌గా భావిస్తున్నారు. అలాంటి మారుతున్న జీవనశైలికి కొత్త నిర్వచనం ఇవ్వాలనే ఆలోచన నుంచి రూపుదిద్దుకుంటున్న ప్రీమియం నివాస ప్రపంచమే మై హోమ్ వ్యోమా.

నాలుగు దశాబ్దాల నమ్మకం.. ఒక కొత్త అధ్యాయం

మై హోమ్ అన్న పేరే తెలుగు రాష్ట్రాల్లో ఒక నమ్మకం, ఒక బ్రాండ్‌గా ప్రజల్లో నాటుకుపోయింది. నాలుగు దశాబ్దాలకుపైగా హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ ప్రయాణంలో తనదైన ముద్ర వేసింది. నాణ్యత, నమ్మకం, సమయపాలన, పారదర్శకత వంటి విలువలతో ఎన్నో రెసిడెన్షియల్, కమర్షియల్ ల్యాండ్ మార్క్స్‌ను నిర్మిస్తూ హైదరాబాద్ అభివృద్దిలో భాగమైంది. నగరవ్యాప్తంగా 27 ల్యాండ్‌మార్క్ డెవలప్‌మెంట్ ద్వారా తన సత్తాను చాటుకుంది. ఒక ఇల్లు కట్టడం అంటే ఒక కుటుంబానికి భవిష్యత్తు కట్టడం. ఒక కమ్యూనిటీ నిర్మించడం అంటే తరతరాలకు ఒక జీవన వాతావరణం ఇవ్వడం. అదే ఆలోచనకు కొనసాగింపుగా ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది మై హోమ్ వ్యోమా.

My Home Vyoma

My Home Vyoma

 మై హోమ్ వ్యోమా-లొకేషన్‌ అడ్వాంటేజ్‌

నానక్‌రామ్‌గూడ అంటే ఒక లొకేషన్‌ కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో ఒక ప్యూచర్ అడ్రస్‌గా నిలుస్తోంది. గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, కోకాపేట్‌, నియోపాలిస్‌ వంటి గ్రోత్ కారిడార్ ప్రాంతాల మధ్యలో నానక్‌రామ్ గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఒక కీలకమైన అర్బన్ డెస్టినేషన్‌గా ఎదుగుతోంది. అలాంటి ప్రైమ్ లొకేషన్‌లో 22.34 ఎకరాల విస్తీర్ణంలో మై హోమ్ వ్యోమా రూపుదిద్దుకుంటోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి సుమారు 5 నిమిషాలు, హైటెక్ సిటీ నుంచి సుమారు 10 నిమిషాలు, కాకాపేట్–నియోపాలిస్‌ నుంచి సుమారు 10 నిమిషాలు, జూబ్లీహిల్స్ నుంచి సుమారు 15 నిమిషాల్లో చేరుకోగలిగే ప్రాంతంలో  నిర్మాణమవుతోంది. కార్పొరేట్‌ ఆఫీసులు, షాపింగ్‌, హాస్పిటాలిటీ, హెల్త్‌ కేర్‌ వంటివి సదుపాయాలు మెండుగా ఉన్న ప్రాంతంలో నిర్మితమవుతోంది. ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సుమారు 30 నిమిషాల్లో సులువగా చేరుకోవచ్చు. కాంటినెంటల్ హాస్పిటల్‌కు సుమారు 5 నిమిషాల్లో, షెరాటన్ హోటల్‌కు సుమారు 5 నిమిషాల్లో, ఐకియాకు సుమారు 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ MY HOME VYOMA లొకేషన్ భవిష్యత్ హైదరాబాద్‌లో ఒక వ్యూహత్మక ప్రాంతంగా చెప్పవచ్చు.

లగ్జరీకి అసలైన అర్థం MY Home Vyoma

లగ్జరీ అంటే భారీ నిర్మాణం మాత్రమే కాదు.. ప్రకృతితో కలిసి జీవించడం కూడా.. మై హోమ్ వ్యోమా ప్రత్యేకతను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాజెక్టుకున్న స్పేస్ అని చెప్పవచ్చు. చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌లతో పాటు పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, ఆటలకు డెడికేటెడ్ జోన్స్ ఉన్నాయి. ఇక సాయంత్రం కూర్చుని సేద తీరాలనుకునేవారికి సీటింగ్ ఏరియా సౌకర్యం ఉంది. పచ్చని ప్రకృతిలో గడపాలనుకునునేవారికి  ఇది అద్భతమైన అనుభవాన్ని అందిస్తుంది. 22.34 ఎకరాల ప్రాజెక్ట్‌లో 83 శాతం ఓపెన్ స్పేస్ ఉంది. ల్యాట్ స్కేప్ అండ్‌ లైఫ్‌స్ట్రైల్ కోసం కేటాయించడం ఈ ప్రాజెక్ట్‌ ఆలోచనా విధానాన్ని స్పష్టంగా చెబుతోంది. నగరాల్లో చదరపు అడుగులు పెరుగుతున్న కొద్దీ ఓపెన్ స్పేస్ తగ్గిపోతున్న కాలంలో.. ఇక్కడ ఓపెన్ స్పేస్‌ను లగ్జరీలో ఒక భాగంగా చూస్తున్నారు.

My Home Hyderabad

My Home Vyoma

Live in the Moment కాన్సెప్ట్

మై హోమ్ వ్యోమాలో 12 టవర్లు, జీ+50/51 అంతస్తుల నిర్మాణం, మొత్తం 2,360 నివాసాలు ఉన్నాయి. ఇందులో 3, 4 బీహెచ్‌కే అల్ట్రా లగ్జరీ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ హై-రైజ్ లివింగ్ అంటే కేవలం ఎత్తులో నివసించడం కాదు.. ఎత్తులో ఉన్న ఇంటికి సువిశాలమైన పచ్చదనం, ప్రకృతి అనుభూతిని జోడించడం..! ఆర్కిటెక్చర్‌కు, ల్యాండ్‌స్కేప్‌కు మధ్య చక్కటి సమతుల్యతను సృష్టించడం. నగర జీవితం వేగంగా పరుగెడుతున్నప్పుడు.. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మనసు కాస్త నెమ్మదించాలి. అందుకే మై హోమ్ వ్యోమా ప్రాజెక్ట్‌ ‘లైవ్ ఇన్ ది మూమెంట్’  అనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఉరుకుల పరుగుల నగర జీవితం నుంచి బయటపడి.. ప్రశాంతమైన, ప్రకృతికి దగ్గరగా, అనుభూతులతో కూడిన జీవనశైలిని అందించడమే వ్యోమా ప్రత్యేకత.

రెండు క్లబ్‌ హౌస్‌లు..కమ్యూనిటీ వేడుకలకు వేదికలు..

లగ్జరీని ఫర్నీచర్‌తో కొలవలేం. లగ్జరీని ఫిట్టింగ్స్‌తో మాత్రమే నిర్వచించలేం. లగ్జరీ అంటే మనకు నచ్చిన జీవితం మనకు నచ్చిన విధంగా గడపగలగడం.  మై హోమ్ వ్యోమాలో రెండు గ్రాండ్ క్లబ్ హౌస్‌లు ఉన్నాయి. రెండూ కలిపి 1 లక్ష చదరపు అడుగులకుపైగా లైఫ్‌స్ట్రైల్ స్పేస్‌ను అందిస్తున్నాయి. క్లబ్‌ హౌసెస్‌లో ఫిట్‌నెస్ జిమ్, స్పా అండ్ సెల్యూన్, మోగా అండ్ ఏరోబిక్స్, పిల్లల కోసం ఇండోర్‌ గేమ్స్‌, పికెల్ బాల్ వంటివి ఉన్నాయి. ఇక పంక్షన్లు నిర్వహించుకునేందుకు మల్టీపర్పస్ హాల్స్, అతిథుల కోసం గెస్ట్ రూమ్స్, రోజువారీ అవసరాల కోసం సూపర్ మార్కెట్లు, హెల్త్ సెంటర్, ఫార్మసీ, బ్యాంకులు, ఏటీఎంలు వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి. ఒక రోజును ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే ఇక్కడ జీవించవచ్చు.

ఒక ప్రాజెక్ట్ కాదు కాదు… ఒక కమ్యూనిటీ

ఎత్తైన టవర్స్ ఎన్నో ఉంటాయి. కానీ ఎత్తైన టవర్స్  మధ్య మనుషుల మధ్య దూరం పెరగకపోవడం చూసుకోవడం ఒక మంచి కమ్యూనిటీకి అసలు పరీక్ష. మై హోమ్ వ్యోమాలో వాకింగ్, జాగింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ ట్రాక్, పిల్లల కోసం ప్లే ఏరియా, బాస్కెట్‌బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, ఔట్‌డోర్ జిమ్, స్కేటింగ్ రింక్, సీటింగ్ జోన్లు, పెట్ జోన్, స్విమ్మింగ్ పూల్, లాన్స్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. పిల్లలకు ప్లే గ్రౌండ్ దొరికితే ఆట మొదలవుతుంది. పెద్దలకు వాకింగ్ ట్రాక్ దొరికితే పరిచయాలు మొదలవుతాయి. ఒక లాన్ దొరికితే సెలబ్రేషన్లు మొదలవుతాయి. ఒక కామన్ స్పేస్ దొరికితే మాటలు మొదలవుతాయి. అలా బిల్డింగ్స్ కలిస్తే కాంప్లెక్స్ అవుతుంది.. మనుషులు కలిస్తే కమ్యూనిటీ అవుతుంది

FUTURE LIVING

ప్యూచర్ లివింగ్ అంటే టెక్నాలజీ ఒక్కటే కాదు. ప్యూచర్ హోమ్ అంటే స్మార్ట్ డివైసెస్ మాత్రమే కాదు. ప్యూచర్ లివింగ్..మోర్‌ స్పేస్‌..మోర్‌ నేచర్‌..మోర్‌ వెల్‌నెస్‌..మోర్‌ కమ్యూనిటీ..మోర్‌ టైమ్‌ అండ్‌ మోర్‌ లైఫ్‌!.. ఈ ఆలోచనతో మై హోమ్ వ్యోమాలో  హోమ్ డిజైన్ నుంచి ల్యాడ్‌స్కేప్ వరకు, క్లబ్ హోస్ నుంచి కమ్యూనిటీ స్పేస్ వరకు ఒక ఇంటిగ్రేటెట్ లైఫ్‌స్ట్రైల్‌ను ఆవిష్కరించే ప్రయత్నం కనిపిస్తుంది.

-Nature is not an amenity..Nature is the lifestyle- నగరంలో ప్రకృతి కోసం బయటికి వెళ్లాల్సిన రోజులు వస్తున్నాయి. కానీ ఒక నిజమైన లగ్జరీ కమ్యూనిటీలో ప్రకృతి బయట కాదు..మన జీవనంలో భాగం కావాలి. మై హోమ్ వ్యోమాలో ఓపెన్ స్పేస్, గ్రీనరీ, లేక్ వ్యూస్, ఔట్‌డోర్ లైఫ్‌స్ట్రైల్ స్పేస్‌కు ఇచ్చిన ప్రాధాన్యం ఈ ఆలోచనను బలపరుస్తుంది.

-మై హోమ్ వ్యోమా.. రేపటి హైదరాబాద్‌లో ఈరోజే ఒక అడ్రస్‌! మొత్తం 22.34 ఎకరాల విస్తారమైన ప్రాంగణంలో 83 శాతం ఓపెన్ స్పేస్‌.. చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య ఆకాశాన్ని తాకేలా 12 టవర్లు.. లోపల అత్యాధునిక విలాసవంతమైన నివాసాలు.. వీటి మధ్యలో ఒక అద్భుతమైన కమ్యూనిటీ! ఇదే మై హోమ్ వ్యోమా.

 My Home

My Home Vyoma

లగ్జరీకి కేరాఫ్ అడ్రస్

ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌ బిజినెస్ డెస్టినేషన్ మాత్రమే కాదు…ఒక పూర్తిస్థాయి అర్బన్ ఏకోసిస్టమ్‌గా ఎదుగుతున్న ప్రాంతం. ఆ ఏకో సిస్టమ్ మధ్యలో ఒక ప్రీమియం రెసిడెన్షియల్ కమ్యూనిటీనే మై హోమ్ వ్యోమా. ఇది కేవలం ఎక్కడ ఇల్లు కొనాలి అనే ప్రశ్నకు సమాధానం కాదు. ఎలాంటి జీవితాన్ని ఎంచుకోవాలి అనే ప్రశ్నకు ఒక సమాధానం. ఎందుకంటే లగ్జరీ అంటే గోడల మధ్య ఉన్న స్థలం కాదు. మన జీవితం కోసం ఉన్న స్పేస్! ప్యూచర్ అంటే రేపు రావడం కాదు. రేపటి జీవితాన్ని ఈరోజే ఆలోచించడం.హోమ్ అంటే ఒక అడ్రస్ కాదు. మనుషులు, ప్రకృతి, అనుభవాలు కలిసి తయారయ్యే ఒక ప్రపంచం. ఒక్క మాటలో చెప్పాలంటే.. My Home Vyoma-Live in the Moment. Make Living Better.

Follow Us