AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లీలు తిన్నాక వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు!

పల్లీలు మనందరికీ ఎంతో ఇష్టమైన టైమ్‌పాస్ స్నాక్. రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా పల్లీలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, పల్లీలు తిన్న వెంటనే నీరు తాగకూడదని పెద్దలు, ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. దీని వెనుక ఉన్న అసలు కారణాలు, కలిగే ఆరోగ్య సమస్యల గురించి బెంగళూరుకు చెందిన క్లినికల్ న్యూట్రిషన్ నిపుణులు వివరిస్తున్నారు.

Jyothi Gadda
|

Updated on: Oct 08, 2026 | 4:45 PM

Share
వేరుశనగలు పోషకాల గని. వీటిలో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే, పల్లీలు తిన్న వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పల్లీలలో నూనె శాతంతో పాటు శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది.

1 / 5
గొంతు నొప్పి, దగ్గు, జలుబు- పల్లీలలో సహజ సిద్ధమైన నూనెలు ఉండటంతో పాటు, ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి. పల్లీలు తిన్న వెంటనే నీరు ముఖ్యంగా చల్లని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా మార్పులు వచ్చి గొంతులో మంట, దగ్గు, జలుబు, శ్వాసకోశ అసౌకర్యం తలెత్తుతాయి.

2 / 5
జీర్ణ సంబంధిత సమస్యలు- పల్లీలలో ఫ్యాట్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి అరగడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణరసాలు విలీనమై జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆయుర్వేదం ప్రకారం కూడా తిన్న వెంటనే నీరు తాగడం జీర్ణాగ్నిని తగ్గిస్తుంది.

3 / 5
నూనె శాతంతో వికారం- పల్లీలలో నూనె పదార్థం ఎక్కువ. నూనె లేదా కొవ్వు ఉన్న పదార్థాలు తిన్నాక వెంటనే నీరు తాగితే గొంతులో ఒక రకమైన జిడ్డుగా అనిపించి కొందరిలో వికారం లేదా వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది.

4 / 5
ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?- పల్లీలు తిన్న తర్వాత కనీసం 10 నుండి 15 నిమిషాల వరకు నీరు తాగకుండా వేచి ఉండటం మంచిది. అత్యవసరంగా నీరు తాగాల్సి వస్తే మరీ చల్లటి నీళ్లకు బదులుగా గది ఉష్ణోగ్రతలో ఉండే నీటిని లేదా గోరువెచ్చని నీటిని తక్కువ పరిమాణంలో తీసుకోండి. కొంతమందికి వేరుశనగల వల్ల అలర్జీలు రావచ్చు. అలాంటివారు పల్లీలకు దూరంగా ఉండాలి.

5 / 5
Follow Us