AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై పోక్సో కేసు!

కేరళలో 11 ఏళ్ల మైనర్‌ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. త్రిస్సూర్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, బాలుడి వాంగ్మూలం నమోదు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది.

11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై పోక్సో కేసు!
Influencer Booked Under Pocso
Balaraju Goud
|

Updated on: Oct 08, 2026 | 4:03 PM

Share

కేరళలో మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సోషల్ మీడియా మహిళా  ఇన్‌ఫ్లుయెన్సర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. త్రిస్సూర్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. నిందితురాలిపై త్రిస్సూర్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (POCSO Act) కింద వివిధ సెక్షన్లతో కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 ఏళ్ల బాలుడిపై నిందితురాలు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ మూడు రోజుల క్రితం ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. అనంతరం బాలుడికి త్రిస్సూర్ జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షలు, బాలుడి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలను పోలీసులు ప్రస్తుతం గోప్యంగా ఉంచుతున్నారు.

నిందితురాలిని ప్రశ్నించడంతో పాటు ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉందని, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనర్‌కు సంబంధించిన కేసు కావడంతో బాధితుడి గుర్తింపును పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళపై చట్టపరమైన చర్యలు దర్యాప్తులో వెలుగుచూసే ఆధారాల ఆధారంగా ముందుకు సాగుతామని పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us