AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరానికి ఇనుములాంటి బలాన్ని ఇచ్చే మినుములు అన్నం

మినుముల అన్నం ఇది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాలతో నిండిన బలవర్ధకమైన ఆహారం. సంప్రదాయ తమిళ వంటకాల్లో ఒకటైన ఈ మినప కిచిడీ, తరతరాలుగా శరీర పుష్టి, ఆరోగ్యం కోసం తింటారు. ఎదిగే ఆడపిల్లలు, మగపిల్లలు, బాలింతలు వృద్ధులు.. ఇలా ప్రతి వయస్సు వారికీ ఈ కిచిడీ చాలా మంచిది.

Prasanna Yadla
|

Updated on: Oct 08, 2026 | 2:09 PM

Share
ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌లో ఒక కప్పు పొట్టు మినపపప్పును తీసుకోండి. మీడియం మంటపైన ఏడు నుండి ఎనిమిది నిమిషాల పాటు పప్పును బాగా రోస్ట్ చేయండి. పచ్చివాసన పోయి, మంచి రుచి రావడానికి ఇది సహాయపడుతుంది. పప్పు రంగు కాస్త మారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే గిన్నెలో ఒక కప్పు బియ్యం తీసుకోండి .

1 / 5

పప్పు  బియ్యం రెండింటినీ కలిపి నాలుగు నుండి ఐదు సార్లు నీటిలో బాగా కడగండి. పొట్టు మినపపప్పు నుండి వచ్చే నలుపుదనం పోయేంతవరకు రుద్దుతూ కడగాలి. శుభ్రంగా కడిగిన తర్వాత, మళ్ళీ నీటిలో ముంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టండి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. ఇందులో లవంగాలు, యాలకులు, స్టార్ ఎనీస్, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసి కాస్త వేయించండి.

పప్పు బియ్యం రెండింటినీ కలిపి నాలుగు నుండి ఐదు సార్లు నీటిలో బాగా కడగండి. పొట్టు మినపపప్పు నుండి వచ్చే నలుపుదనం పోయేంతవరకు రుద్దుతూ కడగాలి. శుభ్రంగా కడిగిన తర్వాత, మళ్ళీ నీటిలో ముంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. ఇందులో లవంగాలు, యాలకులు, స్టార్ ఎనీస్, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసి కాస్త వేయించండి.

2 / 5
తరువాత, ఎండు మిరపకాయ ముక్కలు,  అర టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఇవి వేగాక, అర కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఈ సమయంలో కొద్దిగా కరివేపాకు, ఒక టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించండి.

3 / 5
వేగిన తర్వాత, అర టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు వేసి ఒక్కసారి కలిపి, వెంటనే నానబెట్టిన మినపపప్పు, బియ్యం మిశ్రమాన్ని వేయండి. మీడియం మంటపైన కలుపుతూ, మిశ్రమంలోని నీరు మొత్తం ఎగిరిపోయేంతవరకు రెండు నుండి మూడు నిమిషాలు ఫ్రై చేయండి.ఇప్పుడు, నాలుగు కప్పుల నీటిని కలపండి. రెండు టేబుల్ స్పూన్ల తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఈ సమయంలో ఉప్పు రుచి చూసి అవసరమైతే సర్దుబాటు చేయవచ్చు.

4 / 5
కుక్కర్ మూత పెట్టి, రెండు నుండి మూడు విజిల్స్ వచ్చేవరకు హై ఫ్లేమ్‌లో ఉడికించి, స్టవ్ ఆఫ్ చేయండి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీయండి. చక్కగా ఉడికిన మినప కిచిడీని గరిటతో మెల్లగా కలపండి. పప్పు మరియు బియ్యం రెండు కూడా చక్కగా ఉడికి, మరీ ముద్దగా కాకుండా పొడిపొడిగా రావడాన్ని గమనించవచ్చు. వేడివేడి కిచిడీని పెరుగు రైతాతో, సాంబార్‌తో లేదా రసంతో కలిపి వడ్డించి తినండి.

5 / 5
Follow Us