భారతీయుడు మళ్ళీ వచ్చేస్తున్నాడు.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన శంకర్.. త్వరలో షూటింగ్ షురూ
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇండియన్ 3పై భారీ అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. సినిమాకు సంబంధించిన కీలక వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈమేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్, ప్రెస్టీజియష్ చిత్రాలను నిర్మిస్తోన్న భారీ నిర్మాణ సంస్థ కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘భారతీయుడు3’. 1996లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీకి స్వీకెల్‌గా భారతీయుడు2, భారతీయుడు 3 చిత్రాలను కమల్, శంకర్ కాంబోలో రూపొందించటానికి లైకా సంస్థ సిద్ధమైంది. అందులో భాగంగా 2024లో భారతీయుడు 2 విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘భారతీయుడు3’ను చిత్రీకరించటానికి మేకర్స్ సిద్ధమయ్యారు.
ఇప్పటికే ‘భారతీయుడు3’లో కొంత భాగాన్ని చిత్రీకరించారు. దానికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. 10 రోజుల్లో ‘భారతీయుడు3’కి సంబంధించిన మిగిలిన భాగాన్ని పూర్తి చేయటానికి షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ముగ్గురు వ్యక్తులు గుర్రాలపై వేగంగా వెళుతుంటే దుమ్ము, దూళి రేగుతున్నట్లుగా ఉండే ఫొటో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. భారతీయుడు 3 ఎలా ఉండబోతుందనే విషయాన్ని భారతీయుడు 2 క్లైమాక్స్‌లో చూపించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను రూపొందించటంతో పాటు స్టార్స్‌తో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్, అధినేత సుభాస్కరన్ ఇప్పుడు మరో ప్రెస్టీజియస్ మూవీగా ‘భారతీయుడు3’ని మనకు అందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి సేనాపతి లంచాన్ని అంతమొందించటానికి చేసే పోరాటం ఎలా ఉంటుందో బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయాల్సిందే.
సాధారణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న దూరదృష్టి కలిగిన పారిశ్రామికవేత్త సుభాస్కరన్. వ్యాపార రంగంలో సాధించిన విజయాన్ని సినిమా రంగంలోనూ కొనసాగిస్తూ, లైకా ప్రొడక్షన్స్‌ను భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా నిలబెట్టారు. వైవిధ్యమైన కంటెంట్ చిత్రాలతో పాటు ‘2.0’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరింత విస్తరింప చేశారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు నిర్మించడమే కాకుండా, కొత్త ఆలోచనలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నాణ్యమైన కథనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ప్రత్యేకత. భారతీయ సంస్కృతి, ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో లైకా ప్రొడక్షన్స్‌లో సినిమాలను రూపొందిస్తున్నారు.
Senapathy is back with zero tolerance. 🔥 The resurgence begins in #Indian3 🇮🇳 War Mode. ⚔️
Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @anirudhofficial #Siddharth @MSKajalAggarwal @priya_Bshankar @actorsimha @iam_SJSuryah @dop_ravivarman @muthurajthangvl @sundarksam @teamaimpr
#Hindustani3 🇮🇳 #Bharateeyudu3 🇮🇳 #WarMode
— Lyca Productions (@LycaProductions) October 8, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
