ATM: అకౌంట్ నుంచి కట్ అయినా ఏటీఎం నుంచి డబ్బులు రాలేదా..? నో టెన్షన్.. ఇలా చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..
నగదు అవసరాల కోసం కొన్నిసార్లు ఏటీఎం సెంటర్‌కు వెళతాం. డబ్బులు విత్ డ్రా చేయగానే.. అకౌంట్ నుంచి కట్ అవుతాయి కానీ మెషీన్ నుంచి బయటకు రావు. ఇలాంటి పరిస్థితి ప్రతీఒక్కరికీ ఎదురై ఉంటుంది. ఇలాంటప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

కొన్ని సందర్భాల్లో ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసినప్పుడు అకౌంట్ నుంచి కట్ అయినా మెషిన్ నుంచి బయటకు రావు. ఇలా జరిగినప్పుడు వెంటనే డబ్బులు మీ అకౌంట్లోకి ఆటోమేటిక్‌గా రిటన్ అవుతాయి. కానీ కొన్నిసార్లు మీ అకౌంట్లోకి తిరిగి రావు. ఇలాంటి సమస్యలు చాలామంది ఎదుర్కొని ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు చాలామంది ముందుగా ఆందోళన పడుతుంటారు. డబ్బులు తిరిగి వస్తాయా.. లేదా అని భయపడుతుంటారు. ఏటీఎం మెషిన్‌లో టెక్నికల్ ప్రాబ్లం లేదా విద్యుత్ కోత కారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు మొబైల్‌కు మెస్సేజ్ వచ్చినా ఏటీఎం మెషిన్ నుంచి బయటకు రావు.
ఎలా ఫిర్యాదు చేయాలి..?
అకౌంట్ నుంచి డెబిట్ అయినా ఏటీఎం నుంచి మెషీన్ రాకపోతే ఎలాంటి ఆందోళన పడాల్సిన అసవరం లేదు. ఈ మేరకు ఆర్బీఐ దీనికి సంబంధించి స్పష్టమైన నిబంధనలు తీసుకొచ్చింది. ఇలాంటి సందర్భాల్లో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మీరు సులువుగా తిరిగి పొందే అవకాశముంది. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏటీఎం నుంచి వచ్చే స్లిప్‌ను తీసుకుని భద్రపర్చుకోవాలి. ఒకవేళ స్లిప్ రాని పక్షంలో మొబైల్‌కు వచ్చే మెస్సేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏటీఎం మెషిన్ లేదా ఏటీఎం లోపల క్యాబిన్లపై ప్రదర్శించబడి ఉంటే బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలి. మీ సమస్యను సిబ్బందికి చెబితే పరిష్కారిస్తారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మీరు ఫిర్యాదు చేసిన ఐదు పని దినాల్లో డబ్బులు తిరిగి అందించాల్సి ఉంటుంది.
ఆటోమేటిక్‌గా జమ కాకపోతే ఏం చేయాలి..?
ఆటో రివర్సల్ సిస్టమ్, ఆధునిక టెక్నాలజీ వల్ల 24 గంటల్లో కస్టమర్ ఖాతాల్లో డబ్బు ఆటోమేటిక్‌గా జమ అవుతుంది. ఒకవేళ ఐదు వర్కింగ్ డేస్‌లో మీ డబ్బును తిరిగి జమ చేయకపోతే ప్రతీ రోజుకు రూ.100 చొప్పున బ్యాంక్ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్‌కు ఫిర్యాదు చేసినా సమస్య అలాగే ఉంటే.. cms.rbi.org.in వెబ్ సైట్ ద్వారా ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మీ డబ్బుకు వడ్డీ, జరిమానాతో సహా తిరిగి చెల్లించేలా బ్యాంక్‌పై ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. దీంతో ఖాతాదారులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ డబ్బులు మీకు తప్పనిసరిగా తిరిగి వస్తాయి. సాధారణంగా బ్యాంక్ వద్దనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్బీఐ అంబుడ్స్‌మన్ వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు.
