AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలోనే ఫస్ట్ ఓటీటీ సంస్థ ఎదో తెలుసా..? ఇది అస్సలు ఊహించలేరు గురూ..!!

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు ముందే భారత్‌లో ఓటీటీ ప్రయోగానికి శ్రీకారం చుట్టిన సంస్థ ఎదో తెలుసా.? అప్పట్లోనే సినిమాలు అందించి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే అప్పటి ఇంటర్నెట్ సమస్యలు, ఖరీదైన డేటా కారణంగా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది .

ఇండియాలోనే ఫస్ట్ ఓటీటీ సంస్థ ఎదో తెలుసా..? ఇది అస్సలు ఊహించలేరు గురూ..!!
Ott
Rajeev Rayala
|

Updated on: Oct 08, 2026 | 3:30 PM

Share

ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే. ఆ తర్వాత టీవీలో సినిమా వచ్చే వరకు ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ లేదా ఇంట్లోని స్మార్ట్ టీవీ ఆన్ చేస్తే చాలు.. నచ్చిన సినిమాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, జియోహాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మన రోజువారీ వినోదంలో భాగమైపోయాయి. థియేటర్లలో విడుదలైన కొద్ది వారాలకే సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, ఒరిజినల్ కంటెంట్‌ కూడా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఇంత పెద్దదిగా మారిన ఈ ఓటీటీ ప్రపంచానికి భారత్‌లో తొలి అడుగు ఎప్పుడు పడింది.? నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల కంటే ముందే మన దేశంలో ఓటీటీ సేవలను ప్రారంభించిన సంస్థ ఏది.? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ పేరు మారుమోగుతున్న సమయంలోనే భారతదేశంలోనూ డిజిటల్ వీడియో మార్కెట్‌పై కొన్ని సంస్థలు ప్రయోగాలు మొదలుపెట్టాయి. అందులో ముందుగా నిలిచింది రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. 2008లో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బిగ్‌ఫ్లిక్స్ పేరుతో వీడియో ఆన్ డిమాండ్ సేవను ప్రారంభించింది. అప్పట్లో ఇదిఇప్పుడున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ కాకపోయినా.. ఇంటర్నెట్ ద్వారా సినిమాలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నంగా ఇది భారత డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ముందడుగుగా నిలిచింది. ఇప్పుడు ఆడియన్స్ కు ఓటీటీ అంటే సాధారణంగా నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వీడియో గుర్తుకు వస్తాయి. కానీ ఈ ప్లాట్‌ఫామ్‌లు భారత్‌లోకి రాకముందే బిగ్‌ఫ్లిక్స్ డిజిటల్ మూవీ స్ట్రీమింగ్ ఆలోచనను భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేసింది.

బిగ్‌ఫ్లిక్స్  సినిమాలను ఇంటర్నెట్ ద్వారా ప్రేక్షకులకు అందించడంపై దృష్టి పెట్టింది. హిందీతో పాటు తెలుగు సహా పలు భారతీయ భాషల్లో సినిమాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నించింది.  అప్పట్లో ఇంటర్నెట్‌లో సినిమా చూడటం అనేది చాలా మందికి కొత్త అనుభవం.  2008-12 మధ్యకాలంలో భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం ఇప్పటిలా లేదు. చాలా ప్రాంతాల్లో 2G కనెక్టివిటీనే ఉండేది. 3G కూడా అందరికీ సులభంగా అందుబాటులో ఉండేది కాదు. మొబైల్ డేటా కూడా ఖరీదైంది. ఇప్పుడైతే కొన్ని వందల రూపాయలకే భారీ డేటా ప్యాక్‌లు, అన్ లిమిటెడ్ డేటా వస్తుంది. కానీ అప్పట్లో డేటా వ్ ఆడాలంటే కొంచం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనికి తోడు ఇంటర్నెట్ స్పీడ్ కూడా అంతగా ఉండేది కాదు. ఒక సినిమా చూడాలంటే ముందుగా వీడియో లోడ్ అవ్వాలి.. మధ్యలో బఫరింగ్ ఆగాలి.. మళ్లీ ప్లే కావాలి. ముఖ్యంగా హెచ్‌డీ కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ చేయడం అప్పటి నెట్‌వర్క్ పరిస్థితుల్లో పెద్ద సవాలుగా ఉండేది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగా ప్రత్యేకమైన ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, భారీ బడ్జెట్ షోలు, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అప్పట్లో పెద్దగా అందుబాటులో ఉండేది కాదు. ఆ తర్వాత ఇండియాలో ఇంటర్ నెట్ వాడకం పెరిగిపోయింది. దాంతో రకరకాల ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇండియాలోనే ఫస్ట్ ఓటీటీ సంస్థ ఎదో తెలుసా..?
ఇండియాలోనే ఫస్ట్ ఓటీటీ సంస్థ ఎదో తెలుసా..?
సీతాఫలం ఆకుల్లో సూపర్ మ్యాటర్.. ఆ రోగాలను తరిమికొట్టే దివ్యౌషధం!
సీతాఫలం ఆకుల్లో సూపర్ మ్యాటర్.. ఆ రోగాలను తరిమికొట్టే దివ్యౌషధం!
నదీ తీరంలోనే అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? హిందూ సంప్రదాయంలో అసలు
నదీ తీరంలోనే అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? హిందూ సంప్రదాయంలో అసలు
ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
అకౌంట్ నుంచి కట్ అయినా ఏటీఎం నుంచి నగదు రాలేదా..?
అకౌంట్ నుంచి కట్ అయినా ఏటీఎం నుంచి నగదు రాలేదా..?
జైలులో ఉండాల్సిన ఖైదీలు ఇంట్లో.. జైలర్ మాత్రం జైలులో..!
జైలులో ఉండాల్సిన ఖైదీలు ఇంట్లో.. జైలర్ మాత్రం జైలులో..!
ఇంట్లో కిటికీల విషయంలో ఈ తప్పులు చేయకండి.. నెగిటివిటీ పెరుగుతుందట
ఇంట్లో కిటికీల విషయంలో ఈ తప్పులు చేయకండి.. నెగిటివిటీ పెరుగుతుందట
సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై పోలీసులకు ఫిర్యాదు
సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై పోలీసులకు ఫిర్యాదు
పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల ముష్టియుద్ధం!
పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల ముష్టియుద్ధం!
అమావాస్య రోజు ఈ వస్తువులు కొనకండి.. ఉప్పు, నూనె నుంచి బంగారం వరకు
అమావాస్య రోజు ఈ వస్తువులు కొనకండి.. ఉప్పు, నూనె నుంచి బంగారం వరకు