AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Under 19 Asia Cup 2026: U19 ఆసియా కప్ 2026లో అసలైన హీట్ నవంబర్ 8న కనిపించనుంది. గతేడాది ఫైనల్‌లో ఎదురైన భారత్-పాకిస్థాన్ జట్లు ఈసారి గ్రూప్ దశలోనే ఢీకొనబోతున్నాయి. ఒమన్ వేదికగా జరిగే ఈ పోరు యువ క్రికెటర్లకు భారీ వేదికగా మారనుంది. ఆ తర్వాత సెమీఫైనల్స్, నవంబర్ 14న ఫైనల్‌తో టోర్నీ విజేత ఎవరో తేలిపోనుంది.

Asia Cup: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
Asia Cup 2026 Schedule
Venkata Chari
|

Updated on: Oct 08, 2026 | 3:18 PM

Share

Under 19 Asia Cup 2026: యువ క్రికెట్‌లో మరోసారి భారత్-పాకిస్థాన్ సమరం మోగనుంది. U19 ఆసియా కప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ 8న ఒమన్ వేదికగా రెండు జట్లు తలపడనున్నాయి. గతేడాది ఫైనల్ జ్ఞాపకాలు ఇంకా తాజాగానే ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) 2026 పురుషుల అండర్-19 ఆసియా కప్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈసారి టోర్నీకి ఒమన్ ఆతిథ్యమిస్తోంది. నవంబర్ 5 నుంచి నవంబర్ 14 వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి.

గ్రూప్ A

భారత్ U19

పాకిస్థాన్ U19

ఇవి కూడా చదవండి

యూఏఈ U19

నేపాల్ U19

గ్రూప్ B

శ్రీలంక U19

బంగ్లాదేశ్ U19

అఫ్గానిస్థాన్ U19

మలేషియా U19

ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. లీగ్ దశలో మొత్తం 12 మ్యాచ్‌లు జరుగుతాయి. సెమీఫైనల్స్ నవంబర్ 12న, ఫైనల్ నవంబర్ 14న జరగనుంది.

ఎక్కువమంది చదివినది: IND vs WI: రాంచీలో శ్రేయస్ సేన సరికొత్త చరిత్రకు సిద్ధం..? ఇప్పటి వరకు ఎవరూ సాధించని రికార్డ్‌పై కన్ను!

నవంబర్ 8.. భారత్ vs పాకిస్థాన్..!

టోర్నీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మ్యాచ్ ఇదే. భారత్ U19 vs పాకిస్థాన్ U19 పోరు నవంబర్ 8న జరగనుంది. ఒమన్‌లోని ఓసీఏ గ్రౌండ్ 1 ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వేదిక కానుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది.

గతేడాది U19 ఆసియా కప్ ఫైనల్‌లో కూడా భారత్-పాకిస్థాన్ తలపడ్డాయి. 2025 డిసెంబర్‌లో దుబాయ్‌లో జరిగిన ఆ టైటిల్ పోరులో పాకిస్థాన్ U19 ఏకంగా 191 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫర్హాన్ యూసఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు టైటిల్ గెలుచుకుని, రెండోసారి అండర్-19 ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో 2026 టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

పూర్తి షెడ్యూల్ ఇదే..

తేదీ మ్యాచ్ వేదిక
నవంబర్ 5 శ్రీలంక U19 vs మలేషియా U19 ఓసీఏ గ్రౌండ్ 2
నవంబర్ 5 బంగ్లాదేశ్ U19 vs అఫ్గానిస్థాన్ U19 ఓసీఏ గ్రౌండ్ 1
నవంబర్ 6 పాకిస్థాన్ U19 vs UAE U19 ఓసీఏ గ్రౌండ్ 2
నవంబర్ 6 భారత్ U19 vs నేపాల్ U19 ఓసీఏ గ్రౌండ్ 1
నవంబర్ 7 అఫ్గానిస్థాన్ U19 vs మలేషియా U19 ఓసీఏ గ్రౌండ్ 2
నవంబర్ 7 శ్రీలంక U19 vs బంగ్లాదేశ్ U19 ఓసీఏ గ్రౌండ్ 1
నవంబర్ 8 UAE U19 vs నేపాల్ U19 ఓసీఏ గ్రౌండ్ 2
నవంబర్ 8 భారత్ U19 vs పాకిస్థాన్ U19 OCA Ground 1
నవంబర్ 9 బంగ్లాదేశ్ U19 vs మలేషియా U19 ఓసీఏ గ్రౌండ్ 2
నవంబర్ 9 శ్రీలంక U19 vs అఫ్గానిస్థాన్ U19 ఓసీఏ గ్రౌండ్ 1
నవంబర్ 10 భారత్ U19 vs UAE U19 ఓసీఏ గ్రౌండ్ 2
నవంబర్ 10 పాకిస్థాన్ U19 vs నేపాల్ U19 ఓసీఏ గ్రౌండ్ 1
నవంబర్ 12 సెమీఫైనల్ 1: A1 vs B2 ఓసీఏ గ్రౌండ్ 2
నవంబర్ 12 సెమీఫైనల్ 2: B1 vs A2 ఓసీఏ గ్రౌండ్ 1
నవంబర్ 14 ఫైనల్ ఓసీఏ గ్రౌండ్ 2

50 ఓవర్ల ఫార్మాట్‌లో టోర్నీ..

U19 ఆసియా కప్ 2026 మొత్తం 50 ఓవర్ల ఫార్మాట్‌లోనే జరగనుంది. గతేడాది UAEలో నిర్వహించిన టోర్నీ కూడా ఇదే విధానంలో జరిగింది. ప్రతి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఫైనల్ మినహా మిగిలిన మ్యాచ్ రోజుల్లో డబుల్-హెడర్‌లు ఉంటాయి.

ఎక్కువమంది చదివినది: IND vs WI 2nd T20I: 2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. ఆ టీమిండియా డేంజరస్ ప్లేయర్ ఎంట్రీ?

గతేడాది ఓటమికి భారత్ బదులు తీర్చుకుంటుందా?

2025 U19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి ఎదుర్కొంది. ఈసారి గ్రూప్ దశలోనే మరోసారి రెండు జట్లు ఎదురుపడుతున్నాయి. ఫలితంగా నవంబర్ 8 మ్యాచ్ సాధారణ లీగ్ గేమ్ కంటే ఎక్కువ ఉత్కంఠను పంచే అవకాశం ఉంది.

అయితే రెండు జట్లకూ ముందుగా గ్రూప్ దశలోని ఇతర మ్యాచ్‌లు కీలకమే. భారత్ నవంబర్ 6న నేపాల్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత నవంబర్ 8న పాకిస్థాన్‌తో, నవంబర్ 10న UAEతో తలపడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నదీ తీరంలోనే అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? హిందూ సంప్రదాయంలో అసలు
నదీ తీరంలోనే అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? హిందూ సంప్రదాయంలో అసలు
ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
అకౌంట్ నుంచి కట్ అయినా ఏటీఎం నుంచి నగదు రాలేదా..?
అకౌంట్ నుంచి కట్ అయినా ఏటీఎం నుంచి నగదు రాలేదా..?
జైలులో ఉండాల్సిన ఖైదీలు ఇంట్లో.. జైలర్ మాత్రం జైలులో..!
జైలులో ఉండాల్సిన ఖైదీలు ఇంట్లో.. జైలర్ మాత్రం జైలులో..!
ఇంట్లో కిటికీల విషయంలో ఈ తప్పులు చేయకండి.. నెగిటివిటీ పెరుగుతుందట
ఇంట్లో కిటికీల విషయంలో ఈ తప్పులు చేయకండి.. నెగిటివిటీ పెరుగుతుందట
సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై పోలీసులకు ఫిర్యాదు
సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై పోలీసులకు ఫిర్యాదు
పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల ముష్టియుద్ధం!
పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల ముష్టియుద్ధం!
అమావాస్య రోజు ఈ వస్తువులు కొనకండి.. ఉప్పు, నూనె నుంచి బంగారం వరకు
అమావాస్య రోజు ఈ వస్తువులు కొనకండి.. ఉప్పు, నూనె నుంచి బంగారం వరకు
ఎల్‌నీలో ఎఫెక్ట్.. ఈ సారి చలిలేని శీతాకాలాన్ని చూడబోతున్నారు
ఎల్‌నీలో ఎఫెక్ట్.. ఈ సారి చలిలేని శీతాకాలాన్ని చూడబోతున్నారు
శరీరానికి ఇనుములాంటి బలాన్ని ఇచ్చే మినుములు అన్నం
శరీరానికి ఇనుములాంటి బలాన్ని ఇచ్చే మినుములు అన్నం