హాస్టల్ మెస్‌లలో మాంసాహారంపై నిషేధం.. గవర్నర్ తనిఖీ తర్వాత సంచలన నిర్ణయం..!
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU) హాస్టల్ మెస్‌లు, క్యాంటీన్లలో మాంసాహారం వండటం, వడ్డించడంపై తక్షణ ప్రభావంతో నిషేధం విధించింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఆనందీబెన్ పటేల్ నిర్వహించిన తనిఖీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలను మెరుగుపరచే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు యాజమాన్యం వెల్లడించింది.

అయితే, విద్యార్థుల వ్యక్తిగత ఆహారపు అలవాట్లపై ఎలాంటి ఆంక్షలు లేవని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. హాస్టల్ మెస్‌లలో మాత్రమే మాంసాహారం వండటం, వడ్డించడం నిషేధించగా, విద్యార్థులు తమకు ఇష్టమైతే బయట నుంచి మాంసాహారం తెప్పించుకోవచ్చు లేదా స్వయంగా వండుకోవచ్చని తెలిపింది.
ఇటీవల జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆనందీబెన్ పటేల్, తన తనిఖీ సందర్భంగా మూడు హాస్టల్ మెస్‌లలో మాంసాహారం వండుతున్నట్లు గుర్తించారు. అయితే మాంసాహారాన్ని నిషేధించాలని తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయితే, రెండు హాస్టల్ మెస్‌లలో గడువు ముగిసిన మసాలా దినుసులను ఉపయోగిస్తున్నట్లు గుర్తించామని, ఇది విద్యార్థుల ఆరోగ్యంతో రాజీపడినట్లేనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మెస్‌లలో పరిశుభ్రత, ఆహార నాణ్యతను మెరుగుపరచడంతో పాటు మంచి నాణ్యత గల పనీర్ అందించాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, ఇటీవల రూ.2 కోట్ల విలువైన క్యాన్సర్ మందుల కుంభకోణం కూడా KGMUలో వెలుగులోకి రావడంతో విశ్వవిద్యాలయం వార్తల్లో నిలిచింది. యూరాలజీ విభాగంలో ప్రభుత్వ అసాధ్య యోజన కింద సరఫరా చేసిన ఖరీదైన మందులను రోగుల పేర్లను దుర్వినియోగం చేసి మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి. ప్రాథమిక విచారణలో అక్రమాల ఆనవాళ్లు బయటపడటంతో ముగ్గురు కాంట్రాక్ట్ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. విచారణ పూర్తయ్యే వరకు వారు లక్నో నగరాన్ని విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
2025 అక్టోబర్-నవంబర్ నెలల్లో నెలకు సుమారు రూ.10 లక్షలుగా ఉన్న మందుల వినియోగం, 2026 ఫిబ్రవరిలో రూ.40 లక్షలకు, మార్చిలో రూ.45 లక్షలకు పెరగడంతో యాజమాన్యానికి అనుమానం కలిగింది. దీంతో విచారణ చేపట్టగా దాదాపు రూ.2 కోట్ల విలువైన మందుల దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయంలో పారదర్శకత, పరిశుభ్రత, పరిపాలనా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..