AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిస్రీ బజార్‌లో భారీ పేలుడు.. పేలిపోయిన రెండు స్కూటర్లు.. ఐదుగురికి సీరియస్!

బుధవారం (అక్టోబర్ 8) సాయంత్రం ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని మెస్టన్ రోడ్‌లోని మిస్రీ బజార్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండు స్కూటర్లు చెల్లాచెదురయ్యాయి. దీంతో మిస్రీ మార్కెట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు

మిస్రీ బజార్‌లో భారీ పేలుడు.. పేలిపోయిన  రెండు స్కూటర్లు.. ఐదుగురికి సీరియస్!
Kanpur Blast
Balaraju Goud
|

Updated on: Oct 08, 2025 | 9:19 PM

Share

బుధవారం (అక్టోబర్ 8) సాయంత్రం ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని మెస్టన్ రోడ్‌లోని మిస్రీ బజార్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండు స్కూటర్లు చెల్లాచెదురయ్యాయి. దీంతో మిస్రీ  మార్కెట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఉర్సులా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. పేలుడుకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ పోలీసు బృందంతో సంఘటనా స్థలంలో పరిశీలిస్తున్నారు.

ఈ సంఘటన బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మూల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మెస్టన్ రోడ్‌లోని మిస్రీ బజార్‌లో జరిగింది. సాయంత్రం కావడంతో మార్కెట్ రద్దీగా ఉంది. ఇంతలో, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన రెండు స్కూటర్లపై శక్తివంతమైన పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం దాదాపు 500 మీటర్ల దూరంలో వినిపించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. సంఘటనా స్థలం చుట్టూ ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు. రెండు వాహనాల శకలాలు చెల్లాచెదురు కావడంతో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి నిఘా వర్గాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇది ప్రమాదమా లేదా కుట్రనా అనేది తేలనుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా