కొడుకు నిశ్చితార్థంలో సంతోషంగా డాన్స్ చేస్తూ.. కుప్పకూలిపోయిన తండ్రి.. చివరికి..!
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో తన కొడుకు నిశ్చితార్థంలో నృత్యం చేస్తూ ఒక వ్యక్తి మరణించాడు. తన కొడుకు నిశ్చితార్థ వేడుకలో తన కుటుంబంతో కలిసి డీజేలో సంతోషంగా, ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నాడు. ఇంతలో, అతను అకస్మాత్తుగా జారిపడి పడిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు, వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం కాస్తా విషాదంగా మారిపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 65 ఏళ్ల వ్యక్తి అకస్మాత్తుగా మరణించాడు. కొడుకు నిశ్చితార్థంలో సంతోషంగా గడిపిన తండ్రి అంతలోనే ప్రాణాలు విడిచాడు. డాన్స్ చేస్తుండగా, అతని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించి, నేలపై కుప్పకూలిపోయాడు. వెంటనే తేరుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నిశ్చితార్థం వేడక కాస్తా విషాదంగా మారిపోయింది.
ఈ విషాద ఘటన బులంద్‌షహర్‌లోని అమర్‌గఢ్‌లో చోటు చేసుకుంది. నానక్ కుటుంబానికి చెందిన మనోజ్ అనే వ్యక్తి నిశ్చితార్థ వేడుక జరుగుతోంది. అతిథులందరూ వచ్చారు, ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనాలు డీజే మీద డ్యాన్స్ చేస్తున్నారు. తన కొడుకు నిశ్చితార్థంతో సంతోషంగా ఉన్న నానక్ స్వయంగా డాన్స్ చేస్తూ అందర్నీ ఉత్సాహపరిచాడు.
నానక్ నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే, అతన్ని సమీప ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి, అతని పరిస్థితి విషమంగా ఉండటం చూసి, మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించారు. కానీ నానక్‌ను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. దీంతో నిశ్చితార్థం కాస్తా దుఃఖంగా మారింది. కొడుకు నిశ్చితార్థానికి ముందే తండ్రి మరణం ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తండ్రి మరణం తర్వాత నిశ్చితార్థం కూడా వాయిదా పడింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




