CM Yogi: రూ.100 కోట్ల విలువైన భూమిని రూ.100 లీజుకి తీసుకున్న ఆజం ఖాన్.. తిరిగి స్వాధీనం చేసుకున్న యోగీ సర్కార్

2012లో మహ్మద్‌ అలీ జౌహర్‌ యూనివర్సిటీ పేరిట ఆజం ఈ భవనాన్ని లీజుకు తీసుకున్నాడు. ఈ లీజు డీడ్‌లోని పాయింట్ నంబర్ 7లో కేటాయించిన భూమిలో విశ్వవిద్యాలయం నిర్మించబడుతుందని.. నిర్మాణం పనులను ఒక సంవత్సరంలోపు ప్రారంభిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ భూమిని ఇతర అవసరాలకు వినియోగించరాదని ఇందులో నిబంధన పెట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే డీఎంకు ఫిర్యాదు చేశారు.

CM Yogi: రూ.100 కోట్ల విలువైన భూమిని రూ.100 లీజుకి తీసుకున్న ఆజం ఖాన్.. తిరిగి స్వాధీనం చేసుకున్న యోగీ సర్కార్
Azam Khan's Jauhar Trust
Follow us

|

Updated on: Oct 31, 2023 | 3:03 PM

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి తనదైన శైలిలో పాలన చేస్తున్నారు. నేరాలను అరికట్టడానికి తమ ప్రభుత్వం  కట్టుబడి ఉందని పలు నిర్ణయాలతో చెప్పకనే చెప్పేస్తున్నారు. తాజాగా  జైలులో ఉన్న ఎస్పీ నేత ఆజం ఖాన్‌కు యోగి ప్రభుత్వం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేబినెట్ సమావేశంలో ఆజం ఖాన్ జోహార్ యూనివర్సిటీకి ఇచ్చిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుంది. ఎస్పీ ప్రభుత్వ హయాంలో రాంపూర్‌లోని ముర్తాజా హయ్యర్ సెకండరీ స్కూల్ భవనంతో సహా మొత్తం క్యాంపస్‌ను మౌలానా మహ్మద్ జోహార్ ట్రస్ట్‌కు 99 ఏళ్ల లీజుపై అజంకు ఇచ్చారు. దాదాపు రూ.100 కోట్ల విలువైన ఈ 3825 చదరపు మీటర్ల భూమికి వార్షిక అద్దె కేవలం రూ.100 మాత్రమే.

ఈ భూమి కోసం సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌తో ఆజం ఖాన్ ఒప్పందం కూడా చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రభుత్వం లీజును రద్దు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, వివిధ శాఖల నుండి వచ్చిన దాదాపు 12 ప్రతిపాదనలపై చర్చించారు, అందులో విద్యా శాఖ నుండి ఈ భూమికి సంబంధించిన ప్రతిపాదన కూడా చేర్చబడింది. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఏకంగా భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.

ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆజంఖాన్ కార్యాలయంతో పాటు రాంపూర్ పబ్లిక్ స్కూల్ స్థలం కూడా ఖాళీ కానుంది. బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనా ఈ అంశాన్నిలేవనెత్తారు. ప్రభుత్వం వద్ద తీసుకున్న భూమి లీజు నిబంధనలను ఆజంఖాన్ ఉల్లంఘించారని ఎమ్మెల్యే ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

తోప్‌ఖానా రోడ్‌లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకున్న తర్వాత ఇక్కడ ఆజం ఖాన్ పార్టీ కార్యాలయంతో పాటు దారుల్ అవామ్ , రాంపూర్ పబ్లిక్ స్కూల్‌ను నిర్మించారు. ఇప్పుడు లీజు రద్దు చేయడంతో త్వరలో ప్రభుత్వం ఈ కోట్ల విలువ జేసే ఈ భూమిని స్వాధీనం చేసుకోనుంది.

ప్రభుత్వం నుంచి భూములు లాక్కున్న..

ఎస్పీ ప్రభుత్వంలో ఉన్న తన ప్రభావాన్ని ఉపయోగించి ఆజంఖాన్ ప్రభుత్వ ముర్తజా హయ్యర్ సెకండరీ స్కూల్ భవనం, స్థలాన్ని విద్యాశాఖ నుంచి లీజుకు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. అదే సమయంలో తోప్‌ఖానా రోడ్‌లో దారుల్ అవామ్ , రాంపూర్ పబ్లిక్ స్కూల్ తో పాటు తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి, దారుల్ ఆవామ్ ఉన్న భవనంలో, జిల్లా పాఠశాల ఇన్‌స్పెక్టర్ కార్యాలయం ఉండగా, రాంపూర్ పబ్లిక్ స్కూల్ భవనంలో, జిల్లా ప్రాథమిక విద్యా అధికారి కార్యాలయం ఉంది.

2012లో మహ్మద్‌ అలీ జౌహర్‌ యూనివర్సిటీ పేరిట ఆజం ఈ భవనాన్ని లీజుకు తీసుకున్నాడు. ఈ లీజు డీడ్‌లోని పాయింట్ నంబర్ 7లో కేటాయించిన భూమిలో విశ్వవిద్యాలయం నిర్మించబడుతుందని.. నిర్మాణం పనులను ఒక సంవత్సరంలోపు ప్రారంభిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ భూమిని ఇతర అవసరాలకు వినియోగించరాదని ఇందులో నిబంధన పెట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే డీఎంకు ఫిర్యాదు చేశారు. డీఎం విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా కేబినెట్ లీజును రద్దు చేసింది.

నష్టంపై విచారణ జరుపుతున్న కమిటీ

దీంతో పాటు ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టంపై విచారణ చేసేందుకు డీఎం రవీంద్రకుమార్ మందార్ నేతృత్వంలో విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అధికారిక వర్గాల ప్రకారం ఆజం ఖాన్ ఈ భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు ఇక్కడ 4000 మంది పిల్లలు చదువుతున్నారు.

ఇది లావుండగా ఆజంఖాన్ ప్రభావంతో ఏ అధికారి కూడా అభ్యంతరం చెప్పే ధైర్యం చూపకపోవడంతో ఆ భూమిని ఖాళీ చేసి ఆజంఖాన్‌కు అప్పగించారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ ప్రభుత్వం ఉంది.  అజం ఖాన్ స్వయంగా క్యాబినెట్ మంత్రి , పట్టణాభివృద్ధి, మైనారిటీ సంక్షేమం వంటి ఏడు బలమైన శాఖలను కలిగి ఉన్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ కోసం చూస్తున్నారా.? టైటాన్‌ నుంచి
ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ కోసం చూస్తున్నారా.? టైటాన్‌ నుంచి
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ డ్రింక్స్‌తో రోగనిరోధక శక్తి
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ డ్రింక్స్‌తో రోగనిరోధక శక్తి
28 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌... వన్‌ప్లస్‌ కొత్త ఫోన్
28 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌... వన్‌ప్లస్‌ కొత్త ఫోన్
ప్రభాస్ దారిలో టాలీవుడ్ హీరోలు.. ఫార్ములా వర్కవుట్ అయ్యేనా
ప్రభాస్ దారిలో టాలీవుడ్ హీరోలు.. ఫార్ములా వర్కవుట్ అయ్యేనా
ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే చాలు.... మీ వంట గ్యాస్‌ ఆదా అవుతుంది!
ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే చాలు.... మీ వంట గ్యాస్‌ ఆదా అవుతుంది!
క్రాన్బెర్రీస్ ఎప్పుడైనా తిన్నారా? ఈ సమస్యలున్న వారికి దివ్యౌషధం!
క్రాన్బెర్రీస్ ఎప్పుడైనా తిన్నారా? ఈ సమస్యలున్న వారికి దివ్యౌషధం!
ప్రాణంలేని నరాలకు జీవం పోసే 'మ్యాజిక్' మసాలా!
ప్రాణంలేని నరాలకు జీవం పోసే 'మ్యాజిక్' మసాలా!
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
విజయ్ దళపతి ఎత్తుకున్న ఈ చిన్నోడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కొడుకు.
విజయ్ దళపతి ఎత్తుకున్న ఈ చిన్నోడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కొడుకు.
నకిలీ అద్దె రసీదు సమర్పిస్తున్నారా? జాగ్రత్త.. తెలిసిపోతుంది!
నకిలీ అద్దె రసీదు సమర్పిస్తున్నారా? జాగ్రత్త.. తెలిసిపోతుంది!
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?