Tata Motors: దీదీ సర్కార్‌పై రతన్ టాటా భారీ విజయం.. సింగూర్ వివాదంలో టాటా మోటార్స్‌కు 766 కోట్ల పరిహారం
2008 సంవత్సరంలో భూ వివాదం కారణంగా టాటా మోటార్స్ సంస్థ అక్టోబర్‌లో పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్ నుండి గుజరాత్‌లోని సనంద్‌కు తన తయారీ ప్లాంట్‌ను బదిలీ చేయాల్సి వచ్చింది. అయితే అప్పటికే టాటా మోటార్స్ సింగూరులో రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. అనంతరం తలెత్తిన భూ వివాదం కారణంగా.. టాటా మోటార్స్ తన ప్లాంట్‌ను సింగూరు నుంచి గుజరాత్‌కు తరలించాల్సి వచ్చింది. టాటా సంస్థకు చెందిన నానో కారు సింగూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయాల్సి ఉంది.

పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్ భూ వివాదంలో రతన్ టాటాకు చెందిన టాటా మోటార్స్ భారీ విజయం సాధించింది. టాటా మోటార్స్ సాధించిన విజయంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీకి పెద్ద దెబ్బ తగినట్లు అయింది. సింగూరు వివాదంలో టాటా మోటార్స్ సాధించిన విజయంతో ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం టాటా మోటార్స్‌కు భారీ పరిహారం ఇవ్వనుంది. సింగూర్ తయారీ కర్మాగారంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు టాటా మోటార్స్‌కు బెంగాల్ ప్రభుత్వం రూ.766 కోట్ల పరిహారం ఇవ్వనుంది. ఈ పరిహారం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.
అసలు సింగూరు సమస్య ఏమిటంటే..
2008 సంవత్సరంలో భూ వివాదం కారణంగా టాటా మోటార్స్ సంస్థ అక్టోబర్‌లో పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్ నుండి గుజరాత్‌లోని సనంద్‌కు తన తయారీ ప్లాంట్‌ను బదిలీ చేయాల్సి వచ్చింది. అయితే అప్పటికే టాటా మోటార్స్ సింగూరులో రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. అనంతరం తలెత్తిన భూ వివాదం కారణంగా.. టాటా మోటార్స్ తన ప్లాంట్‌ను సింగూరు నుంచి గుజరాత్‌కు తరలించాల్సి వచ్చింది. టాటా సంస్థకు చెందిన నానో కారు సింగూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయాల్సి ఉంది.
టాటా మోటార్స్ ఇచ్చిన సమాచారం మేరకు..
ముగ్గురు సభ్యులతో ఏర్పడిన మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని టాటా మోటార్స్ స్టాక్ మార్కెట్‌కు తెలిపింది. ఈ బృందం ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రతివాది వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యుబిఐడిసి) నుంచి భారీ మొత్తంలో రికవరీ చేసుకునే వీలుంది. పెట్టిన పెట్టుబడికి 11 శాతం వార్షిక వడ్డీతో పాటు రూ. 765.78 కోట్ల మొత్తాన్ని రికవరీ చేసుకునే అర్హత టాటా మోటార్స్ ఉంది. అయితే ఈ ఇపుడు ఈ వడ్డీ సెప్టెంబరు 1, 2016 నుంచి లెక్కించడం మొదలు పెట్టి.. పరిహారం చెల్లించే తేదీ వరకు లెక్కిస్తారు.
సింగూరు ప్లాంట్‌ను మూసివేయడం వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు టాటా మోటార్స్ WBIDC నుండి పరిహారం కోరింది. ఇందులో పెట్టుబడిపై నష్టం సహా ఇతర అంశాలపై క్లెయిమ్‌లు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..