Hotels New Rules: హోటల్లకు సర్కార్ కొత్త రూల్స్.. ఇప్పుడు ఈ పని చేయాల్సిందే, లేకపోతే..
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఆహార పదార్ధాల కల్తీ ఘటనలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆహార పదార్థాలను కల్తీ చేస్తే ఉపేక్షించేదీ లేదన్నారు.
మానవ వ్యర్థాలు, మురికి వస్తువులతో ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆహార పదార్థాలను కల్తీ చేస్తే ఉపేక్షించేదీ లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని హోటళ్లు, ధాబాలు, రెస్టారెంట్‌లు తదితర సంబంధిత సంస్థలపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి హోటల్‌లో పని చేసే వారి వివరాలను వెల్లడి చేయాలన్నారు. సాధారణ ప్రజల ఆరోగ్య భద్రతను నిర్ధారించడానికి, అవసరాన్ని బట్టి నిబంధనలను సవరించడానికి కీలకల సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి యోగి ఇచ్చిన ముఖ్యమైన మార్గదర్శకాలలో, ఇటీవలి కాలంలో, జ్యూస్, పప్పు, రోటీ వంటి ఆహార పదార్థాలను మానవ వ్యర్థాలు, తినకూడని, మురికి వస్తువులతో కల్తీ చేసే సంఘటనలు ఇటీవలి కాలంలో వివిధ ప్రాంతాల్లో బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా వరుస ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటనలు సామాన్యుడి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి దురుద్దేశపూర్వక ప్రయత్నాలను అస్సలు ఆమోదించలేమన్నారు యోగి. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ముఖ్యంగా ధాబాలు, రెస్టారెంట్‌లు వంటి తినుబండారాలను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని సిఎం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించడం ద్వారా, ఈ సంస్థల నిర్వాహకులతో సహా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరి ధృవీకరణ జరగాలన్నారు. దీని వల్ల ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ మరియు స్థానిక అధికారులు ఉమ్మడి బృందం సమన్వయంతో పని చేయాలని సీఎం సూచించారు.
ఫుడ్ కోర్టుల వద్ద ఆపరేటర్లు, యాజమాన్యాలు, నిర్వాహకులు తదితరుల పేర్లు, చిరునామాలను ప్రముఖంగా ప్రదర్శించాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టాన్ని కూడా అవసరమైన విధంగా సవరించాలని సీఎం సూచించారు. దాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లు వంటి తినుబండారాలలో సీసీటీవీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. కస్టమర్లు కూర్చునే ప్రదేశాలు మాత్రమే కాకుండా సంస్థలోని ఇతర భాగాలను కూడా సీసీటీవీ కవర్ చేయాలన్నారు. ప్రతి హోటల్ CCTV ఫీడ్‌ను సురక్షితంగా ఉంచుతారని, అవసరమైతే పోలీసులు, స్థానిక అధికారులకు అందుబాటులో ఉంచాలని సీఎం యోగి ఆదేశించారు.
ఫుడ్ సెంటర్ల వద్ద పరిశుభ్రత ఉండాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆహార పదార్థాలను తయారుచేసేటప్పుడు, వడ్డించేటప్పుడు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా మాస్క్, గ్లౌజులు ఉపయోగించాలి. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు సీఎం యోగి. సామాన్యుల ఆరోగ్య ప్రయోజనాలతో ఏ రకంగానూ ఆడుకోలేమని అన్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తయారీ, ఆహార పదార్థాల విక్రయం లేదా ఇతర సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను ఆచరణాత్మకతను దృష్టిలో ఉంచుకుని మరింత కఠినతరం చేయాలని అధికారులకు సూచించారు. నిబంధనల ఉల్లంఘనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..