హాయిగా రాత్రంతా నిద్రపోయిన UPSC అభ్యర్ధి.. అంతే రూ.9 లక్షలు వచ్చిపడ్డాయి!
నిద్రపోయినందుకు ఓ యువతికి ఏకంగా రూ.9 లక్షలు ఇచ్చిందో కంపెనీ. అదేంటీ అనుకుంటున్నారా? నిజమండీ.. చక్కగా రాత్రంగా పడుకుని హాయిగా నిద్రపోయినందుకు నగదు బహుమతి ఇచ్చిమరీ సత్కరించింది. ఇలా 60 రోజులపాటు ప్రతి రాత్రి 9 గంటలపాటు నిద్రపోయింది. దీంతో రూ.9 లక్షల డబ్బుతోపాటు..

బెంగళూరులో జరిగిన 60 రోజుల స్లీప్ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా పూణేకు చెందిన యూపీఎస్సీ ఐపీఎస్ అభ్యర్థి పూజా మాధవ్ వావల్ ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రతి రాత్రి సగటున తొమ్మిది గంటలు నిద్రపోయిన 14 మంది ఫైనలిస్టులను అధిగమించి అగ్రస్థానాన్ని అధిరోహించింది. దీంతో రూ. 9.1 లక్షల నగదు బహుమతితోపాటు ‘స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్ కూడా గెలుచుకుంది.
ఈ ఏడాది 4వ ఎడిషన్‌లో భాగంగా స్లీప్ ఇంటర్న్‌షిప్ నిర్వహించారు. ఇది దేశంలో పెరుగుతున్న నిద్ర లేమిపై అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అందులో కేవలం 15 మందిని మాత్రమే షార్ట్‌లిస్ట్ చేశారు. ప్రతి దరఖాస్తుదారునికి ఓ ప్రముఖ బ్రాండ్ నుంచి ఒక మెట్రెస్, ప్రతి రాత్రి వారి విశ్రాంతి అలవాట్లను పర్యవేక్షించడానికి కాంటాక్ట్‌లెస్ స్లీప్ ట్రాకర్‌ను అందించారు. ఈ ఇంటర్న్‌షిప్ అంతటా వారు బెడ్‌పై పడుకుని హాయిగా నిద్రపోవడమే టాస్క్. మెరుగైన నిద్రను పెంచే వర్క్‌షాప్‌ల్లో కూడా పాల్గొన్నారు. ఫైనలిస్టులు కళ్ళకు గంతలు కట్టుకుని మంచం తయారు చేయడం, అలారం గడియారం నిధి వేటలు, వారి క్రమశిక్షణను పరీక్షించడానికి స్లీప్-ఆఫ్ వంటి సరదా గేమ్‌లను కూడా నిర్వహించారు. ఈ ఇంటర్న్‌షిప్‌లో వావ్హల్ 91.36 స్కోరుతో ఇతర ఇంటర్న్‌లను అధిగమించి టైటిల్‌ని గెలుచుకుంది. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన 15 మందికి ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున బహుమతి అందించారు.
🚨 Pune-based UPSC aspirant Pooja Wavhal wins ₹9.1 lakh for sleeping 9 hours a night in Wakefit’s 60-day sleep internship, beating 1 lakh+ applicants. pic.twitter.com/rtHdjFEnyp
— Beats in Brief (@beatsinbrief) July 6, 2025
కాగా ఈ ఇంటర్న్‌షిప్ మొదటి ఎడిషన్ 2019లో ప్రారంభమైంది. అప్పటి నుండి నాలుగు సీజన్‌లను పూర్తి చేసింది. ప్రతి రౌండ్‌లో ఈ కార్యక్రమానికి లక్షలాది దరఖాస్తులు వచ్చేవి. యేటా స్లీప్ ఇంటర్న్ పేరిట జరిగే ఈ కార్యక్రమాన్ని 60 రోజులు రాత్రికి కనీసం 9 గంటలు నిద్రించడం టాస్క్‌గా పెడతారు. కాంటాక్ట్‌లెస్ ట్రాకర్‌ని ఉపయోగించి నిద్ర నాణ్యతను పర్యవేక్షించడం జరుగుతుంది. గతంలో ఆన్‌లైన్ ఫారమ్‌లు, వీడియో రెజ్యూమ్‌లు, సంక్షిప్త ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేవారు. ఇక ఈ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెట్టింట కొందరు జోకులు పేలుస్తున్నారు. ‘నేను రోజుకు 20 గంటలు నిద్రపోగలను అని ఓ యుజర్. ‘లేదు.. లేదు.. నాకు ఖచ్చితంగా తెలుసు! ఆమె IAS కావాలని కలలు కంటోంది’ అని మరొక యూజర్, ఆమె UPSC ప్రిపరేషన్‌కు సిద్ధంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాక ఆమె 24 గంటలు నిద్ర లేకుండా చదువుకోవచ్చు’ అని మరో యూజర్ సరదాగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్లు పెట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.