AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కడుపులో నొప్పి అని ఆస్పత్రికి వెళ్లిన హోంగార్డ్.. టెస్టులు చేసి స్టన్ అయ్యే విషయం చెప్పిన డాక్టర్లు

అనారోగ్య సమస్య వచ్చిందని ఆస్పత్రికి వెళ్తే.. కొత్త సమస్యను క్రియేట్ చేశారు వైద్యులు. ఆ విషయం రోగికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. కానీ నిజం దాగలేదు.

Viral: కడుపులో నొప్పి అని ఆస్పత్రికి వెళ్లిన హోంగార్డ్.. టెస్టులు చేసి స్టన్ అయ్యే విషయం చెప్పిన డాక్టర్లు
Surgery For Kidney Stones
Ram Naramaneni
|

Updated on: Nov 11, 2022 | 11:54 AM

Share

గోటి సమస్యకు మందు వేస్తే.. చేయి పోయినట్లు తయారైంది ఈ వ్యక్తి పరిస్థితి. ఒంట్లో నలతగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లాడు. టెస్టులు చేసి కిడ్నీలో రాళ్లు పడ్డాయని చెప్పిన డాక్టర్.. ఆపరేషన్ చేసి.. వాటిని రిమూవ్ చేశాడు. కొంతకాలం తర్వాత.. మళ్లీ విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో మరోసారి ఆస్పత్రికి వెళ్తే… స్కానింగ్ చేసి కంగుతినే విషయం చెప్పారు. అతడి కడుపులో ఒక కిడ్నీ మాత్రమే ఉందని కచ్చితంగా చెప్పేశారు. మొదట ఆపరేషన్ చేసిన వైద్యుడు ఏకంగా కిడ్నీనే లేపేశాడు అని అప్పుడు అర్థమైంది. ఈ ఇన్సిడెంట్ ఉత్తర్​ప్రదేశ్‌లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే…  కాస్​గంజ్​ జిల్లాకు చెందిన సురేశ్​ చంద్ర పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విపరీతమైన బ్యాక్ పెయిన్ రావడంతో.. హాస్పిటల్‌కు వెళ్లాడు. పలు రకాలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. రిపోర్టులు పరిశీలించిన అనంతరం.. అతడి ఎడమ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తేల్చారు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ సూచనతో 2 రోజుల తర్వాత ఏప్రిల్ 14న అలిగఢ్​ హాస్పిటల్‌లో అతడికి కిడ్నీ ఆపరేషన్​ చేశారు. అనంతరం డాక్టర్ల సూచనతో కొన్ని రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాడు. విశ్రాంతి తర్వాత డ్యూటీకి వెళ్లడం షురూ చేశాడు.

అయితే  అక్టోబర్ 29న అతడికి ఆకస్మాత్తుగా మళ్లీ కడుపు నొప్పి వచ్చింది. దీంతో  ఆస్పత్రికి వెళ్లగా.. అల్ట్రాసౌండ్​ స్కానింగ్ తీశారు అక్కడి డాక్టర్లు. ఆపై డాక్టర్లు చెప్పిన విషయం విని సురేశ్ చంద్ర కంగుతిన్నాడు. రాళ్లను తొలగించేందుకు శస్త్రచికిత్స​ చేసేటప్పుడు పొరపాటున అతడి కిడ్నీ రిమూవ్ చేశారు డాక్టర్లు. ఈ విషయం అతడికి గానీ, కుటుంబ సభ్యులకు గానీ తెలియదు. తాజాగా కడుపులో నొప్పి రావడంతో రివీలయ్యింది.  ఈ ఘటనపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశాడు సురేశ్​ చంద్ర.

మరిన్నిజాతీయ వార్తల కోసం..