Al-Qaeda – India: అల్-ఖైదాతో జాగ్రత్త.. భారత్‌కు కీలక సమాచారం అందించిన ఐక్యరాజ్య సమితి
Al-Qaeda - India: అల్-ఖైదాతో తాజాగా భారత్‌కు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. మరోసారి ఉనికిని చాటుకోడానికి..
Al-Qaeda – India: అల్-ఖైదాతో తాజాగా భారత్‌కు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. మరోసారి ఉనికిని చాటుకోడానికి ఈ తీవ్రవాద సంస్థ ప్రయత్నిస్తోందని అలర్ట్ చేసింది. కొంత కాలంగా బలహీనపడుతూ వస్తున్న ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా మళ్లీ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తున్నాయి. తాలిబన్ల మద్దతుతో ఆప్ఘనిస్తాన్‌లో ఉనికిని చాటుకుంటున్న అల్-ఖైదా-AQIS సంస్థ తన పత్రిక ‘నవా-ఇ-అఫ్గాన్- జిహాద్’ పేరును ‘నవా-ఎ-గజ్వా-ఇ-హింద్’గా మార్చుకుంది. ఈ పరిణామంతో ఈ సంస్థ వ్యూహాలపై అనుమానాలు మొదలయ్యాయి. ఆప్ఘన్ నుంచి కశ్మీర్ వరకూ విస్తరించాలనే లక్ష్యంతోనే ఈ పేరు మార్చారని ఇండియాను అలర్ట్ చేసింది ఐక్యరాజ్య సమితి భద్రతామండలి-UNSC. తాలిబన్ల సహకారంతో అల్‌ఖైదా దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని UNSC తెలిపింది.
2015లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో దాడులకు ముమ్మరం చేయడంతో అల్-ఖైదా చాలా వరకూ బలహీనపడిపోయింది. అయితే గత ఏడాది అక్కడ తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రావడంతో తిరిగి పుంజుకోవడం కోవడం ప్రారంభమైంది. ఆఫ్ఘనిస్తాన్‌లో అల్‌ఖైదా శిక్షణా కేంద్రాలు కూడా పెరిగాయి.. అల్ ఖైదా ప్రస్తుత చీఫ్ ఐమన్ ముహమ్మద్ రబీ అల్ జవహిరి అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చెందిన 400 మంది ముష్కరులకు అల్-ఖైదాలో ఉన్నారని UNSC నివేదిక తెలిపింది. ఆప్ఘనిస్తాన్‌లోని తన శిక్షణా శిబిరాలను పాకిస్తాన్‌కూ విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.