AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కేంద్రమంత్రి అప్రమత్తంతో నిలిచిన ఇద్దరి ప్రాణాలు.. అసలు ఏం జరిగిందంటే!

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అప్రమత్తంతో నదిలో కొట్టుకుపోవాల్సి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. మంగళవారం కేంద్ర మంత్రి లడక్‌లోని ద్రాస్‌కు పర్యటనకు తన కాన్వాయ్‌తో వెళ్తుండగా.. పక్కనే ఉన్న నదిలో పాక్షికంగా మునిగిపోయిన ఒక మినీ ట్రక్కుపై ఇద్దరు వ్యక్తులు నిల్చుండడం గమనించారు. వెంటనే అప్రమత్తమై వాళ్లను కాపాడాలని తమ సిబ్బంది ఆదేశించారు. దీంతో రంగంలోకి సిబ్బంది. వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి స్వయంగా తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

Watch Video: కేంద్రమంత్రి అప్రమత్తంతో నిలిచిన ఇద్దరి ప్రాణాలు.. అసలు ఏం జరిగిందంటే!
Roadside Rescue
Anand T
|

Updated on: Aug 26, 2025 | 8:29 PM

Share

జమ్మూకాశ్మీర్, లడక్‌, ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు ద్రాస్‌కు పర్యటనకు తన కాన్వాయ్‌లో వెళ్తున్నారు. అయితే మార్గమధ్యలో రోడ్డు పక్కనే ఉన్న నదిలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయి ఉండడాన్ని కేంద్రమంత్రి తన కాన్వాయ్‌లో నుంచి గమనించారు. వెంటనే వాళ్ల దగ్గరకు వెళ్లి చిక్కుకుపోయిన వ్యక్తులతో మాట్లాడి తమను కాపాడుతామని వాళ్లకు ధైర్యం చెప్పారు.

వెంటనే నదిలో చిక్కుకున్న వారిని కాపాడాలని తమ సిబ్బంది ఆదేశించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ బృందాలు రంగలంలోకి దిగి నదిలో చిక్కుకుపోయిన ఇద్దరు ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు. వాళ్లు బయటకు వచ్చిన తర్వాత ప్రమాదానికి గల కారణాలను కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు.

కేంద్రమంత్రి ఈ సంఘటన గురించి స్వయంగా తన X ఖాతాలో పోస్ట్‌ చేశారు. లడఖ్‌లోని ద్రాస్ చేరుకునే ముందు, ఒక వాహనం మా కాన్వాయ్ కంటే ముందే నదిలో పడిపోయిందని.. అదృష్టవశాత్తూ, మేము సమయానికి వారిని చూసి.. రక్షించడంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.