Union Minister: ఇండియా కూటమిలోని ఆ రెండు పార్టీలు త్వరలో విలీనం.. కేంద్ర మంత్రి కీలక కామెంట్స్
కొన్ని రాష్ట్ర రాజకీయాలు దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తాయి. అందులో బిహార్ కూడా ఉంటుంది. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన లాలు ప్రసాద్ యాదవ్, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్లే దీనికి ప్రధాన కారణం. వీరిద్దరూ ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ వేర్వేరు పార్టీలు నడుపుతున్నారు. జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతా దళ్ పేరుతో రాజకీయాల్లో క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు.
కొన్ని రాష్ట్ర రాజకీయాలు దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తాయి. అందులో బిహార్ కూడా ఉంటుంది. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన లాలు ప్రసాద్ యాదవ్, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్లే దీనికి ప్రధాన కారణం. వీరిద్దరూ ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ వేర్వేరు పార్టీలు నడుపుతున్నారు. జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతా దళ్ పేరుతో రాజకీయాల్లో క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు పార్టీలపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో నితీష్ కుమార్, లాలు ప్రసాద్ పార్టీలు కలిసిపోనున్నాయన్నారు. ఇండియా కూటమిలో కోనసాగుతున్న నేపథ్యంలో సీట్ల పంపిణీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారని ఆసక్తికర కామెంట్లు చేశారు. దీంతో ఈ వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈరోజుతో పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడింది. దీంతో గిరిరాజ్, లాలు ప్రసాద్ యాదవ్ ఒకే ఫ్లైట్లో కలిసి పాట్నాకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధినేత తనతో వ్యక్తిగత అనుభవాలు పంచుకున్నట్లు కేంద్ర మంత్రి గిరిరాజ్ తెలిపారు. మాట్లాడుకున్న అన్ని విషయాలు బయటకు చెప్పలేక పోయినా కొన్ని మాత్రం చెప్పగలనన్నారు. ప్రస్తుతం బిహార్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా చేసే సమయం ఆసన్నమైందని తనతో పంచుకున్నట్లు మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలోనే రెండు పార్టీలు విలీనం అవుతాయన్నారు.
కేంద్ర మంత్రి గిరిరాజ్ చేసిన విలీనం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు లాలు ప్రసాద్ యాదవ్. ఆయనకి ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ మీడియాలో కనపడాలని ఉంటుంది. దీనికి కారణం ఆయనను ఎవరూ గుర్తించకపోవడమే అని ఘాటుగా స్పందించారు లాలు ప్రసాద్ యాదవ్. అందుకే గిరిరాజ్ సింగ్ ఇలాంటి లేనిపోని మాటలు చెప్పి ప్రజల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారని వివరించారు. దీంతో ఇరుపార్టీలు భవిష్యత్తులో కూడా కలవవన్న విషయంపై స్పష్టతనిచ్చినట్లైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..