AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికార్డ్‌స్థాయికి కంప్యూట్ సామర్థ్యం.. మరో మైలురాయికి అందుకున్న IndiaAI: అశ్విని వైష్ణవ్

ఇండియాఏఐ మిషన్ తన రెండవ రౌండ్‌లో 16,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లకు (GPUలు) చేరుకుంది. దీంతో ఇండియాఏఐ మిషన్ కింద అందుబాటులో ఉన్న GPUల సంఖ్య 34,300 కు పైగా చేరుకుంది. ఈ విజయం స్వదేశీ AI సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయి.

రికార్డ్‌స్థాయికి కంప్యూట్ సామర్థ్యం.. మరో మైలురాయికి అందుకున్న IndiaAI: అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnaw
Balaraju Goud
|

Updated on: May 30, 2025 | 11:25 PM

Share

భారతదేశ జాతీయ కంప్యూట్ సామర్థ్యం 34,000 GPUలను దాటింది. ఈ నేపథ్యంలోనే భారత్ స్వంత ఫౌండేషన్ మోడల్‌ను నిర్మించడానికి మూడు కొత్త స్టార్టప్‌ల ఎంపికతో స్వదేశీ AI సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందుతున్న ఇండియాఏఐ మిషన్ ప్రణాళికను ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతదేశ AI ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో న్యూఢిల్లీలో జరిగిన ‘IndiaAI- Make AI in India, Make AI work for India’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అనేక కీలక కార్యక్రమాలను ప్రకటించారు.

IndiaAI మిషన్ కింద ఎంపికైన జట్లు తమతమ రంగాలలో మొదటి ఐదు ప్రపంచ ర్యాంకింగ్‌లను లక్ష్యంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ ప్రజాస్వామికరణ దార్శనికతను స్పష్టం చేస్తూ, టెక్నాలజీని కొంతమంది చేతుల్లో వదిలివేయకూడదని కేంద్ర మంత్రి అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించకోవాలని, కొత్త పరిష్కారాలను అభివృద్ధి చేయాలని, మెరుగైన అవకాశాలను పొందడం చాలా ముఖ్యమన్నారు. ఈ తత్వశాస్త్రంతోనే IndiaAI మిషన్ సృష్టించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. IndiaAI మిషన్ ప్రతి స్తంభంలో ఆచరణాత్మకంగా గణనీయమైన పురోగతి సాధిస్తున్నామన్నారు. టెక్నాలజీ ప్రజాస్వామికరణకు కామన్ కంప్యూట్ చాలా ముఖ్యమైన సూత్రం అని కేంద్ర మంత్రి తెలిపారు.

AI ఫండ్‌లో ఇప్పటికే 367 డేటాసెట్‌లను అప్‌లోడ్ చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్‌ను ప్రోత్సహించడంలో, మౌలిక సదుపాయాల నమూనాలు, కంప్యూటింగ్ సామర్థ్యాలు, భద్రతా ప్రమాణాలు, ప్రతిభ అభివృద్ధి చొరవలతో కూడిన సమగ్ర పర్యావరణ వ్యవస్థను సృష్టించడంలో IndiaAI మిషన్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. భారతదేశంలో పూర్తి, సమగ్ర AI పర్యావరణ వ్యవస్థను నిర్మించడం ఈ ప్రయత్నాల లక్ష్యం అని ఆయన అన్నారు.

IndiaAI ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం భారతదేశ నిర్దిష్ట డేటాపై శిక్షణ పొందిన స్వదేశీ AI నమూనాలను అభివృద్ధి చేయడంతోపాటు అమలు చేయడం ప్రధాన లక్ష్యం. భారతదేశ AI పర్యావరణ వ్యవస్థ ఇప్పుడు ప్రపంచ విజయాల శిఖరాగ్రంలో ఉందని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ విధమైన దశల ద్వారా, అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించడానికి, ప్రపంచ పొత్తులను నిర్మించడానికి, స్కేలబుల్, ప్రభావవంతమైన పరిష్కారాలను నిర్మించడానికి ఉత్తమ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. స్టేషన్ F, HEC పారిస్‌తో IndiaAI మిషన్ భాగస్వామ్యంతో భారత్ ఆవిష్కరణ దౌత్యంలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఇదిలావుంటే, దేశంలో 85.5 శాతం కుటుంబాలకు కనీసం ఒక స్మార్ట్‌ఫోన్ ఉంది. గురువారం గణాంక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సర్వే ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో 15-29 సంవత్సరాల వయస్సు గల వారిలో దాదాపు 96.8 శాతం మంది గత మూడు నెలల్లో వ్యక్తిగత కాల్స్ చేయడానికి, ఇంటర్నెట్‌ను ఉపయోగించడానికి కనీసం ఒక్కసారైనా మొబైల్ ఫోన్‌లను ఉపయోగించారు. పట్టణ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ వినియోగం 97.6 శాతంగా ఉంది. అండమాన్-నికోబార్ దీవులలోని కొన్ని గ్రామాలు మినహా దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో మొత్తం 34,950 కుటుంబాలను చేర్చారు. ఇందులో 19,071 గ్రామీణ కుటుంబాలు, 15,879 పట్టణ కుటుంబాలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..