ముఖాన మువ్వన్నెల ముసుగు.. తొలగిస్తే ‘పాక్’ పచ్చ రంగు!
మనదేశంలో కొన్నిరకాల శిక్షలు లేవు గానీ.. ఉంటే మాత్రం కొందరికి అదే కరెక్ట్. స్పాట్ పనిష్‌మెంట్ అన్ని విధాలా సమంజసం వాళ్లకి. లేకపోతే.. కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేమన్నానా..! జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అంటారు. పుట్టిన దేశం స్వర్గానికంటే గొప్పది అని దీని అర్థం. అలాంటిది..

హలో గయ్స్.. సరదాగా పాకిస్తాన్‌ను చూసొద్దామా! అక్కడి వాళ్లు భారతీయులను ఎలా చూస్తారు, ఎలాంటి అభిప్రాయంతో ఉంటారో చూద్దామా అంటారు. వాళ్ల మొహం. పాకిస్తాన్‌లోని ఐఎస్‌ఐతో మాట్లాడడానికి అదో వంక. దేశ రహస్యాలను నేరుగా చేరవేయడానికి వాళ్లకదో అడ్డదారి. తెలిసిన ప్రదేశాలనే సరికొత్తగా చూపిస్తాం అంటారు. అదంతా పైపైకే. వాళ్ల అసలు కుట్ర మాత్రం పాకిస్తాన్ ఐఎస్‌ఐతో నేరుగా మాట్లాడ్డం. బహుశా.. మొరిగే కుక్కలు కరవవు అనే సూత్రం ప్రయోగిస్తున్నారేమో..! ఓ కెమెరా, ఓ మైక్ పట్టుకుని హడావుడి చేస్తే.. తమనెవరూ అనుమానించరు, దేశద్రోహులుగా భావించరని మనం అనుకుంటామని వాళ్లు అనుకుంటారు. అలా పాకిస్తాన్ వెళ్లి హడావుడి చేసిందెవరు? తెలుగు ట్రావెల్ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ వెళ్లాడు. అందుకే అనుమానంతో అరెస్ట్ చేసింది NIA. ఒకసారంటే కొత్త. ఆ తరువాతంతా రోతే కదా. ఏముంది అయినా పాకిస్తాన్‌లో. అంత సుందరమైన విదేశాలేముంటాయి అక్కడ. బయ్యా సన్నీ యాదవ్‌కు పాకిస్తాన్‌కు వెళ్లాలనిపించి ఉండొచ్చు. సరే తప్పు లేదనుకుందాం. ఒకసారి వెళ్లాడు.. అక్కడి విషయాలు చెప్పాడు. సరిపోతుంది కదా. ఎందుకని.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదుసార్లు వెళ్లొచ్చాడని చెబుతున్నారు. ఒట్టి ప్రచారమేనా.. నిజంగానే వెళ్లాడా..! అయినా అదేమైనా ఫ్రాన్సా, బ్యాంకాకా.. ఐదుసార్లు వెళ్లిరావడానికి. పట్టుమని ఐదారు సిటీలుంటాయి అంతే పాకిస్తాన్‌లో. ఆ నగరాలే పాకిస్తాన్ ఆయువు పట్టు. అంతకు మించి ఏ ఉండదక్కడ. అయినా వెళ్లాడంటే.. అన్నిసార్లు వెళ్లింది నిజమే...




