Ashwini Vaishnaw: టెలికాం రంగంలో వృద్ధి కనిపించడం లేదా.? రఘురామ్ రాజన్‌పై విరుచుకుపడ్డ అశ్విని వైష్ణవ్‌

భారత ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌పై బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ విరుచుకుపడ్డారు. టెలికాం రంగంలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా అని విమర్శించారు. భారత టెలికలం రంగం, మొబైల్ తయారీ రంగంపై రఘురామ్‌ చేసిన విమర్శలు పూర్తిగా అవాస్తవన్నారు. చికాగో యూనివర్సిటీ లాంటి..

Ashwini Vaishnaw: టెలికాం రంగంలో వృద్ధి కనిపించడం లేదా.? రఘురామ్ రాజన్‌పై విరుచుకుపడ్డ అశ్విని వైష్ణవ్‌
Ashwini Vaishnaw

Updated on: Jun 02, 2023 | 7:11 PM

భారత ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌పై బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ విరుచుకుపడ్డారు. టెలికాం రంగంలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా అని విమర్శించారు. భారత టెలికలం రంగం, మొబైల్ తయారీ రంగంపై రఘురామ్‌ చేసిన విమర్శలు పూర్తిగా అవాస్తవన్నారు.  మాజీ ఆర్‌బీఐ గవర్నర్‌ అయ్యిండి చికాగో యూనివర్సిటీ లాంటి పెద్ద వర్సిటీలో తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు.

ఒకవేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండి ఉంటే టెలికాం రంగం స్కామ్‌లతో దెబ్బతినేదని, అయితే బీజేపీ పాలనలో శక్తివంతంగా మారిందన్నారు. అత్యంత తక్కువ ధరకు డేటా అందిస్తున్న ఏకైక దేశం భారత్‌ అని అన్నారు. యూపీఏ ప్రభుత్వం బీఎస్‌ఎన్‌లు మరణశయ్యపై వదిలేసిందన్న కేంద్ర మంత్రి.. మోదీ వచ్చిన తర్వాతే బీఎస్‌ఎన్‌ఎల్ లాభాల బాట పట్టిందన్నారు. టెలికాం రంగం 4జీ నుంచి 5జీ మారడం భారత సాంకేతిక ఆవిష్కరణకు నిలువుటద్దం అన్నారు. ఎలక్ట్రానిక్స్‌ రంగం ద్వారా 25 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయన్న అశ్విని వైష్ణవ్‌. రఘురామ్ రాజన్‌కు ఈ రంగం వృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

ఇక 2004-14 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనను భారతదేశం కోల్పోయిన దశాబ్దంగా అశ్విన్‌ వైష్ణవ్‌ అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీలు దేశానికి హాని కలిగించే “షార్ట్‌కట్‌ల” రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఇక సరకు రవాణాలో రైల్వేలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్న మంత్రి.. దేశంలో కొత్తగా ప్రతి రోజూ వేస్తున్న రైల్వే ట్రాక్‌ పొడవు సగటును 4 కి.మీల నుంచి 14 కి.మీలకు పెరిగినట్లు మంత్రి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..