Anurag Thakur: డ్రోన్ యాత్రకు శ్రీకారం.. ప్రారంభించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..

తమిళనాడులోని తలంబూరులో గరుడ ఏరోస్పేస్ నేతృత్వంలోని ‘డ్రోన్ యాత్ర’ను అనురాగ్ ఠాకూర్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రోన్‌ సహాయంతో జెండాను ఎగురవేశారు.

Anurag Thakur: డ్రోన్ యాత్రకు శ్రీకారం.. ప్రారంభించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..
Anurag Thakur
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 06, 2022 | 6:03 PM

Drone Yatra: దేశంలోనే తొలి వర్చువల్ డ్రోన్ యూనివర్సిటీని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రారంభించారు. తమిళనాడులోని తలంబూరులో గరుడ ఏరోస్పేస్ నేతృత్వంలోని ‘డ్రోన్ యాత్ర’ను అనురాగ్ ఠాకూర్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రోన్‌ సహాయంతో జెండాను ఎగురవేశారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచార & ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా తన చేత్తో డ్రోన్‌ను ఆపరేట్ చేస్తూ జెండాను ఎగురవేశారు. PLI పథకం లబ్ధిదారు అయిన తమిళనాడుకు చెందిన గరుడ ఏరోస్పేస్ సంస్థ, రాబోయే 75 రోజుల్లో దేశంలోని 775 జిల్లాల్లో డ్రోన్ యాత్రను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకోవాలని యువతను కోరారు. డ్రోన్ యాత్రతో యువతకు డ్రోన్లు, సాంకేతిక రంగాలపై అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు.

చెన్నైలో జరిగిన ఎగ్జిబిషన్‌లో డ్రోన్‌ల ఉపయోగాలు, సాంకేతిక రంగం గురించి వివరించారు. డ్రోన్ స్కిల్లింగ్ & ట్రైనింగ్ కాన్ఫరెన్స్‌ను సైతం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

దేశంలోని యువతకు డ్రోన్ టెక్నాలజీపై అవగాహన కల్పించడమే లక్ష్యంతో కేంద్రం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుంది. డ్రోన్లు, ఆటోమేషన్, AI లేదా మెషీన్ లెర్నింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో యువతలో నైపుణ్యాలను పెంచడం.. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశలను పెంచడం కోసం డ్రోన్ యాత్రను చేపట్టారు.

775 జిల్లాలను చేసే డ్రోన్ యాత్రకు చెందిన 30 బృందాలు ఆయా జిల్లాలో డ్రోన్ నైపుణ్యం, శిక్షణా సమావేశాలను నిర్వహిస్తారు. కళాశాలలు, పాఠశాలల్లో సైతం ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..