Amit Shah: బీజేపీ ఏమి దాచడం లేదు.. అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా
హిండెన్‌బర్గ్-అదానీ వివాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తొలి సారి స్పందించారు. అదానీ వివాదంపై ప్రభుత్వానికి దాచేది లేదన్నారు.

అదానీ వ్యవహారంపై తొలిసారి స్పందించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా . ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందన్నారు . బీజేపీకి దీంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అదానీకి సంబంధించి బీజేపీ ఏమి దాచడం లేదన్నారు అమిత్‌షా. హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని ఎవరు రాసిచ్చారో తెలియదన్నారు. మోదీపై బీబీసీ డాక్యుమెంటరీపై కూడా స్పందించారు అమిత్‌షా. 2002 నుంచి మోదీ ప్రతిష్టను దిగజార్చడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
అయితే ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఈ వివాదంపై ఏమీ మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు దృష్టి సారించినందున ఇప్పుడు దీనిపై వ్యాఖ్యానించడం సరికాదని అమిత్ షా అన్నారు. అయితే, అదే సమయంలో బీజేపీకి భయపడేది లేదని, దాచిపెట్టేది లేదని అన్నారు.
ANIతో అమిత్ షా మాట్లాడుతూ, ‘హిండెన్‌బర్గ్-అదానీ రో కేసును సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంటే మంత్రిగా నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. కానీ, ఇందులో బీజేపీ దాచుకోవడానికి ఏమీ లేదు, భయపడాల్సిన పనిలేదన్నారు అమిత్ షా.
మరిన్ని ఈ వీడియోలో చూడండి..
#WATCH सुप्रीम कोर्ट ने मामले का संज्ञान लिया है। कैबिनेट का सदस्य होने के नाते इस समय इस मुद्दे पर मेरा कुछ भी बोलना सही नहीं होगा। परन्तु इसमें भाजपा के लिए कुछ छुपाने के लिए नहीं है और न ही किसी बात से डरने की जरूरत है: अडानी से जुड़े मुद्दे पर केंद्रीय गृह मंत्री अमित शाह pic.twitter.com/4YLKYA86Bd
— ANI_HindiNews (@AHindinews) February 14, 2023
హిండెన్‌బర్గ్-అదానీ వివాదం రాజకీయ దుమారం..
హిండెన్‌బర్గ్-అదానీ వివాదం కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడంతో పెద్ద రాజకీయ వివాదంగా మారింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు కూడా ప్రధాని మోదీని టార్గెట్ చేశాయి. అదానీ గ్రూపులో ఎల్‌ఐసీ, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడులపై ఆయన ప్రశ్నలు సంధించారు. అయితే పీఎస్‌యూలు, నియంత్రణ సంస్థల ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. దీనితో పాటు, నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం