
జమ్ముకశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి కేంద్రం మరిన్ని కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అమిత్‌షా అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ , ఆర్మీ చీఫ్ మనోజ్‌పాండే , జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా , రా అధికారులు హాజరయ్యారు. జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. వీలైనంత త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా జమ్ముకశ్మీర్ ప్రజలకు హామీ ఇచ్చింది. 2026 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం జాడ లేకుండా చేస్తామని ఈ సమావేశంలో అమిత్‌షా స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో శాంతిభద్రతలపై కూడా ఈ సమావేశంలో అమిత్‌షా సమీక్ష నిర్వహించారు. గత రెండు నెలలుగా కశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరిగిపోవడంపై సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ పోలీసులు , సీఆర్‌పీఎఫ్ , ఆర్మీ బలగాలు మరింత సమన్వయంతో పనిచేయాలని అమిత్‌షా సూచించారు. డిసెంబర్ రెండుసార్లు ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేశారు ఉగ్రవాదులు. రాజౌరిలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు . ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంది కేంద్రం . పాకిస్తాన్ నుంచి చొరబడ్డ 30 మంది ముష్కరుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగిస్తున్నాయి.
కాగా గతేడాది రాజౌరీ, పూంచ్, రియాసీ జిల్లాల్లో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో 28 మంది ఉగ్రవాదులు, 19 మంది భద్రతా సిబ్బంది సహా 54 మంది మరణించారు. ముఖ్యంగా రాజౌరిలో 10 మంది ఉగ్రవాదులు, 14 మంది భద్రతా సిబ్బంది సహా 31 మంది మరణించారు. పూంచ్‌లో 15 మంది ఉగ్రవాదులు, ఐదుగురు భద్రతా సిబ్బంది హతమయ్యారు. రియాసిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గత ఏడాది మేలో చమ్రేర్ అడవుల్లో జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించగా, ఒక ఉన్నతాధికారి గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో ఓ విదేశీ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. ఉగ్రవాదుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని భద్రతా సంస్థలకు అమిత్ షా సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగిస్తుందని హోంమంత్రి పునరుద్ఘాటించారు.
#WATCH | Army chief Gen Manoj Pande arrives at the Ministry of Home Affairs (MHA) in Delhi to attend the high-level security review meeting on Jammu and Kashmir, which will be chaired by Union Home Minister Amit Shah. pic.twitter.com/4APGBg6ueH
— ANI (@ANI) January 2, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..