Amit Shah: మావోయిస్టులపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా
మావోయిస్టులపై జరిపిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయని అమిత్ షా అన్నారు. ఇప్పుడు ఈ సమస్య ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాల్లో మాత్రమే ఉంని, పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి (ఆంధ్రప్రదేశ్) వరకు కారిడార్ నిర్మించాలని మావోయిస్టులు ఒకప్పుడు ప్లాన్ చేశారని చెప్పారు...
మావోయిస్టులపై జరిపిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయని అమిత్ షా అన్నారు. ఇప్పుడు ఈ సమస్య ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాల్లో మాత్రమే ఉంని, పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి (ఆంధ్రప్రదేశ్) వరకు కారిడార్ నిర్మించాలని మావోయిస్టులు ఒకప్పుడు ప్లాన్ చేశారని చెప్పారు.
హింసను విడనాడాలని, ఆయుధాలు వదలి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నక్సలైట్లకు విజ్ఞప్తి చేశారు. నక్సలైట్లు అలా చేయకుంటే వారిపై సమగ్ర పోరాట యాత్ర చేపడుతామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల హింసాకాండలో 55 మంది బాధితులను షా పరామర్శించారు. ‘బస్తర్ పీస్ కమిటీ’ రూపొందించిన డాక్యుమెంటరీని కూడా షా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆయన పంచుకున్నారు.
నక్సలైట్లు లొంగిపోవాలి
నక్సలైట్ల హింసను, భావజాలాన్ని దేశంలో రూపుమాపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారని, ఈశాన్య మిలిటెంట్ల మాదిరిగానే హింసను విడనాడాలని, ఆయుధాలు విడనాడి లొంగిపోవాలని నక్సలైట్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.. అని అన్నారు. మీరు మా మాట వినకుంటే నక్సలైట్లను పూర్తిగా అంతమొందించే ఆపరేషన్ ప్రారంభిస్తామని అన్నారు. మార్చి 31, 2026 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామన్నారు.
नक्सल हमलों से प्रभावित होने वाले लोगों की अंतहीन पीड़ा और दर्द को बताती ‘बस्तर शांति समिति’ द्वारा बनाई गई यह डॉक्यूमेंट्री सभी को देखनी चाहिए।
मानवता के दुश्मन नक्सलवाद ने कैसे इन लोगों के जीवन को उजाड़ दिया…इनका यह दुःख ह्यूमन राइट्स का एक तरफा शोर मचाने वाले लोगों के… pic.twitter.com/hOWhQQELTw
— Amit Shah (@AmitShah) September 20, 2024
త్వరలో సంక్షేమ పథకం:
ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ హింసాత్మకంగా ప్రభావితమైన ప్రజల కోసం హోం మంత్రిత్వ శాఖ త్వరలో సంక్షేమ పథకాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తోందని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో హోం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర రంగాలలో మా సంక్షేమ చర్యల ద్వారా వీలైనంత వరకు సహాయం చేస్తామన్నారు.
నక్సలైట్లు తమ స్వలాభం కోసం చాలా మంది ప్రజల హక్కులను లాక్కోవడమే కాకుండా, వారిని తీవ్రంగా హింసించి చంపుతున్నారని, అందుకే ప్రజలు కూడా వారివైపు మొగ్గు చూపవద్దని సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి