Union Cabinet Expansion 2021: ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండగా.. దీనికి కొన్ని గంటల ముందు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ సహా పలువురు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ కూడా రాజీనామాలు సమర్పించారు. వీరితో పాటు మరికొందరు మంత్రులు కూడా కేబినెట్ నుంచి తప్పుకున్నట్లు అధికారిక సమాచారం అందింది. మంత్రులు దాన్వే రావు సాహెబ్ దాదారావు, బాబుల్ సుప్రియో, ప్రతాప్ సారంగి, డి.వి సదానంద గౌడ, వేవశ్రీ చౌదరి, థవర్ చంద్ గెహ్లాట్, సంజయ్ శ్యామ్ రావు ధోత్రే, రతన్ లాల్ కటారియ తమ పదవుల నుంచి తప్పుకున్నారు. వీరి స్థానంలో కొత్తగా మంత్రులను కేబినెట్‌లోకి చేర్చుకుంటున్నారు. అధికారిక సమాచారం ప్రకారం ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో కొత్తగా 43 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా కేబినెట్‌లో చోటు దక్కించుకున్న వారిలో 12 మంది దళిత వర్గానికి చెందిన వారు, 27 మంది ఓబీసీ నాయకులు ఉన్నట్లు సమాచారం.
ఇదిలాఉంటే.. ప్రస్తుతం ఉన్న కేంద్ర సహాయ మంత్రుల్లో పలువురికి మోదీ ప్రమోషన్ ఇచ్చారు. సహాయ మంత్రులను కాస్తా కేంద్ర మంత్రులుగా ప్రమోట్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి నుంచి స్వతంత్ర మంత్రిగా ప్రమోట్ అయిన వారిలో హర్దీప్ సింగ్ పురి, ఆర్కే సింగ్, కిరెన్ రిజిజు, అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి, పురుషోత్తం రూపాల, మన్సుఖ్ భాయ్ మండవియా ఉన్నారు.
Also read:
Murder in Guntur: గుంటూరు జిల్లాలో దారుణం.. కళ్లలో సర్ఫ్ చల్లి రియల్టర్‌ని కిరాతకంగా చంపేశారు..