AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MPLAD Benefits: ‘ఎంపీలాడ్స్‌’నిధులను ఎవరు విడుదల చేస్తారు.. ఈ ప్రయోజనాలు ఎలా.. ఎవరికోసం..

దేశంలో కరోనా మహమ్మారి సమయంలో దిగజారుతున్న పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థిక ప్రగతి గాడిలో పడుతోంది. అటువంటి పరిస్థితిలో MPLAD పునరుద్ధరణతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో..

MPLAD Benefits: ‘ఎంపీలాడ్స్‌’నిధులను ఎవరు విడుదల చేస్తారు.. ఈ ప్రయోజనాలు ఎలా.. ఎవరికోసం..
Pm Modi
Sanjay Kasula
|

Updated on: Nov 11, 2021 | 1:23 PM

Share

MPLAD Scheme: దేశంలో కరోనా మహమ్మారి సమయంలో దిగజారుతున్న పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థిక ప్రగతి గాడిలో పడుతోంది. అటువంటి పరిస్థితిలో MPLAD పునరుద్ధరణతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో ముఖ్యంగా పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీల్యాడ్స్) పునరుద్ధరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలల్లో పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకాన్ని పునరుద్ధరించింది. ఈ ఏడాది నుంచి రూ. 2 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధులను మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశం అనంతరం అనురాగ్ సింగ్ ఠాకూర్  ఈ వివరాలను వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా రూ. 5 కోట్లు ప్రతి ఎంపీకి అందుతాయని పేర్కొన్నారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం వీటిని కేటాయించుకోవచ్చన్నారు.  దీనితో పాటు, 15వ ఫైనాన్స్ కమిషన్ వ్యవధి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగడానికి కూడా ఆమోదించబడింది.

ఎంపీలు ఎప్పటికప్పుడు వీటిని వినియోగించుకోలేపోతున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. కరోనా కారణంగా గత ఏడాది ఏప్రిల్‌లో ఈ పథకాన్ని నిలిపివేసిన కేంద్రం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలం నుంచి 2025-26 వరకు పథకాన్ని కొనసాగించాలని బుధవారం నిర్ణయించింది.

MPLAD పథకం అంటే..

MPLAD అనగా MP స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం కింద, మొత్తం మొత్తాన్ని భారత ప్రభుత్వం అందజేస్తుంది. నిజానికి ఈ పథకం ఉద్దేశం ఎంపీలకు తమ నియోజకవర్గాల అభివృద్ధికి కొంత మొత్తాన్ని వెచ్చించే హక్కు కల్పించడమే. ఇందులో నీరు, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, రోడ్లు వంటి అనేక అభివృద్ధి పనులు ఉన్నాయి.

ఈ పథకం కింద, MP తన ప్రాంతానికి MPLADS మొత్తం ఒక సంవత్సరంలో 5 కోట్లు. కానీ ఈ మొత్తాన్ని రెండు విడతలుగా రూ.2.5 కోట్లు విడుదల చేస్తున్నారు. ఈ పథకం కింద, ఎంపీలు తమ ప్రాంతంలో ఏడాదిలో రూ. 5 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆమోదించవచ్చు.

వాస్తవానికి కరోనా మహమ్మారి సంక్షోభం దృష్ట్యా  దానిని ఎదుర్కోవటానికి, ఏప్రిల్ 6, 2020న జరిగిన సమావేశంలో మంత్రివర్గం 2020-21 , 2021-22 ఆర్థిక సంవత్సరాలలో MP ఫండ్‌కు నిధులను నిలిపివేసింది. ఇది కాకుండా, కరోనాను ఎదుర్కోవటానికి ఈ మొత్తాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉంచాలని కూడా నిర్ణయించారు. తద్వారా ఈ నిధుల నుండి సేకరించిన మొత్తాన్ని స్క్రీనింగ్, ఆసుపత్రి సౌకర్యాలకు ఉపయోగించవచ్చు.

కేంద్ర ప్రభుత్వం 1993 నుంచి ‘మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ లోకల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ స్కీమ్‌ (ఎంపీలాడ్స్‌)’ను అమలు చేస్తోంది. దీని కింద ప్రతి ఎంపీ ఏడాదికి రూ.5 కోట్ల విలువైన పనులను సిఫారసు చేయవచ్చు. అంటే ఒక్కో లోక్‌సభ సభ్యుడు ఐదేళ్లలో రూ.25 కోట్ల విలువైన పనులకు సిఫారసు చేయవచ్చు. రాష్ట్రంలోని 17 మంది ఎంపీలకు ఏడాదికి రూ.85 కోట్లు మంజూరవుతాయి. ఐదేళ్లలో రూ.425 కోట్లు వస్తాయి. ఈ నిధులతో సంబంధిత ఎంపీ తన నియోజకవర్గ పరిధిలోనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. సామాజిక ఆస్తులను సృష్టించే అభివృద్ధి పనులను సిఫారసు చేయాల్సి ఉంటుంది.

ఆర్థిక సంవత్సరం (రూ. కోట్లలో)

2021-22                                  1583.5

2022-23                                 3965.00

2023-24                                 3958.50

2024-25                                 3955.00

2025-26                                 3955.0

ఆర్థిక వ్యయం                        17417.00

ఈ పథకం ఎలా పనిచేస్తుంది

ఈ పథకం కింద, ఎంపీలు నేరుగా ఎలాంటి మొత్తాన్ని పొందరు. MPLADS పథకం కాలానుగుణంగా సవరించబడే మార్గదర్శకాలచే నిర్వహించబడుతుంది. MPLADS కింద, ప్రభుత్వం ఈ మొత్తాన్ని స్థానిక అధికారులకు విడుదల చేయడంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనగా పనులను నోడల్ జిల్లా అధికార సంస్థకు సిఫార్సు చేస్తుంది.

ఇవి కూడా చదవండి: Makeup Tips: కూతురి పెళ్లిలో తల్లి ప్రత్యేకంగా కనిపించాలంటే.. ఈ చిట్కాలను పాటిస్తే చాలు గ్రేస్‌ఫుల్ లుక్..

SBI: ఎస్‌బీఐలో ఈ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 2 లక్షల ప్రమాద బీమా ఫ్రీ..

Chanakya Niti: కష్టాల్లో ఉన్నారా.. ఇలా ధృ‌ఢంగా ఉండండి.. అదే మీ విజయానికి పూలబాట..

Alcohol: మద్యం తాగుతున్నారా.. ఇది మీకు బ్యాడ్ న్యూసే.. మీ బాడీలో ‘నిషా’ ఎప్పటివరకు ఉంటుందంటే..