AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atal Tunnel Accident: అటల్‌ టన్నెల్‌లో అదుపు తప్పిన కారు.. వేగంగా ప్రయాణిస్తూ గోడను ఢీకొట్టి.. షాకింగ్ వీడియో..

హిమాచ‌ల్‌ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్ జిల్లాలోని అట‌ల్ ట‌న్నెల్‌లో ఓ కారు అదుపు త‌ప్పి బీభ‌త్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న ఈ టూరిస్ట్ కారు ముందు కారును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో పూర్తిగా అదుపు తప్పింది

Atal Tunnel Accident: అటల్‌ టన్నెల్‌లో అదుపు తప్పిన కారు.. వేగంగా ప్రయాణిస్తూ గోడను ఢీకొట్టి.. షాకింగ్ వీడియో..
Atal Tunnel
Basha Shek
|

Updated on: Dec 06, 2021 | 2:16 PM

Share

హిమాచ‌ల్‌ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్ జిల్లాలోని అట‌ల్ ట‌న్నెల్‌లో ఓ కారు అదుపు త‌ప్పి బీభ‌త్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న ఈ టూరిస్ట్ కారు ముందు కారును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో పూర్తిగా అదుపు తప్పింది. కుడివైపు గోడను ఢీకొట్టి అక్కడే ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘ‌ట‌న‌లో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంస‌మైంది. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా కారునడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా భారత ప్రభుత్వం ఈ అటల్‌ టన్నెల్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన సంగతి తెలసిందే. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన నరేంద్రమోదీ అనంతరం దీనిని జాతికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో అటల్‌ టన్నెల్‌ను వీక్షించే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే సమయంలో టన్నెల్‌ లోపల రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు వాహనదారులకు కొన్ని నిబంధనలు, షరతులు విధించింది. టన్నెల్‌ లోపల వాహనాల వేగం 60 kmph/hr కు మించకూడదని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటుచేసింది. ఈ క్రమంలోనే డీఎల్ 10 సీజే 1995 అనే కారు వేగంగా ప్రయాణిస్తూ అదుపుతప్పింది. ఏకంగా అటల్ టన్నెల్ గోడను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే వాహనం దెబ్బతింది. అయితే ఇదే వేగంతో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టినా లేదంటే ఎదురుగా వ‌చ్చే వాహ‌నాన్ని ఢీకొట్టినా భారీ నష్టం జరిగేదని పోలీసులు చెబుతున్నారు.

Also read:

Sonu Sood: రియల్ హీరోకు మరోసారి షాక్.. అక్రమంగా హోటల్ నిర్మించారంటూ..

Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెట్టండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.! అంత ఈజీ కాదు..

Viral Video: సెన్షేషనల్ డ్యాన్స్‌తో హృదయాలను కొల్లగొడుతున్న చిన్నారి.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంతే..

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..