అయోధ్య రామ మందిరాన్ని నిర్మించేది ప్రధాని మోదీనే

ప్రధాని మోదీ నాయకత్వంలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుందన్నారు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే. ముంబైలో శనివారం మూడు మెట్రో లైన్ల శంకుస్ధాపన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో శివసేన మళ్లీ కలిసి అధికారాన్ని చేపట్టడం ఖాయమన్నారు ఠాక్రే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్దవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలోనే రామమందిర నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రధాని ఈ కార్యక్రమానికి […]

అయోధ్య రామ మందిరాన్ని నిర్మించేది ప్రధాని మోదీనే
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2019 | 7:05 PM

ప్రధాని మోదీ నాయకత్వంలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుందన్నారు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే. ముంబైలో శనివారం మూడు మెట్రో లైన్ల శంకుస్ధాపన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో శివసేన మళ్లీ కలిసి అధికారాన్ని చేపట్టడం ఖాయమన్నారు ఠాక్రే.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్దవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలోనే రామమందిర నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రధాని ఈ కార్యక్రమానికి రావడంతో తాను ఎన్నిసార్లు అభినందించాలో తెలియడం లేదన్నారు. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ మోదీ నాయకత్వంలోనే కార్యరూపం దాల్చుతున్నాయని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న జమ్ము కశ్మీర్ అంశానికి సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేయడం ఒక చారిత్రక విషయమని, దీన్ని రద్దు చేసినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు ఉద్దవ్ ఠాక్రే.  అయోధ్యలో రామాలయం కూడా మోదీ సారధ్యంలోనే నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు.