కరోనా వేళ.. కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
ఓ వైపు ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతుంటే.. ఉగ్రవాదులు మాత్రం ఇదే అదనుగా భావిస్తూ.. భారత్‌లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నక్కినట్లు జవాన్లకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, భద్రతాబలగాలు.. కుల్గాం పట్ణంలో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు.. కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతాబలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు […]

ఓ వైపు ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతుంటే.. ఉగ్రవాదులు మాత్రం ఇదే అదనుగా భావిస్తూ.. భారత్‌లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నక్కినట్లు జవాన్లకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, భద్రతాబలగాలు.. కుల్గాం పట్ణంలో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు.. కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతాబలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకోవడంతో.. వారి కోసం భద్రతాబలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.