Supermoon ఏప్రిల్ 8న సూపర్ మూన్.. భారత్‌లోనే ఎందుకలా?

ఏప్రిల్ 8వ తేదీన అంటే వచ్చే బుధవారం పౌర్ణమి రోజుల సూపర్ మూన్ ఆవిష్కారం కాబోతోంది. అందుకు యావత్ ప్రపంచం ఉత్సుకతతో ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈసారి సూపర్ మూన్ స్పెషాలిటీ వేరే అంటున్నారు శాస్త్రవేత్తలు.

  • Rajesh Sharma
  • Publish Date - 2:31 pm, Sat, 4 April 20
Supermoon ఏప్రిల్ 8న సూపర్ మూన్.. భారత్‌లోనే ఎందుకలా?

Supermoon to appear on April 8th: ఏప్రిల్ 8వ తేదీన అంటే వచ్చే బుధవారం పౌర్ణమి రోజుల సూపర్ మూన్ ఆవిష్కారం కాబోతోంది. అందుకు యావత్ ప్రపంచం ఉత్సుకతతో ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈసారి సూపర్ మూన్ స్పెషాలిటీ వేరే అంటున్నారు శాస్త్రవేత్తలు.

సూపర్ మూన్ సాధారణంగా పౌర్ణమి రోజున (ఫుల్ మూన్ డే) ఏర్పడుతుంది. సాధారణ చంద్రుని పరిమాణం కంటే.. సుమారు 7 శాతం పెద్ద సైజులో.. సుమారు 15 శాతం ప్రకాశవంతంగాను కనిపిస్తుంది. అందుకే అలా కనిపించే చంద్రున్ని సూపర్ మూన్‌గా పిలుస్తారు. ఏప్రిల్ 8వ తేదీన కనిపించే సూపర్ మూన్ ప్రపంచంలోని చాలా దేశాల్లో అగుపించనున్నది. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినపుడు మాత్రమే సూపర్ మూన్‌గా కనిపిస్తుందని చెబుతున్నారు.

అయితే ఈ సూపర్ మూన్ భారత దేశంలో కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తల అంఛనా ప్రకారం చంద్రుడు భూమికి అత్యంత చేరువగా వచ్చే సమయం ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 8 గం.ల 5 నిమిషాలకు. ఆ సమయానికి భారత్‌లో సూర్యోదయం జరిగిపోతుంది కాబట్టి చంద్రుడు కనిపించే అవకాశం లేదు. అందుకే ఏప్రిల్ 8వ తేదీన ఆవిష్కారమయ్యే సూపర్ మూన్ మన దేశంలో కనిపించదని శాస్త్రవేత్తలు అంఛనా వేస్తున్నారు. అయితే.. 7వ తేదీన రాత్రి ఎంతో కొంత చేరువగా చంద్రుడు వస్తాడు కాబట్టి.. సాధారణం కంటే ఎక్కువ పరిమాణంలోను, ఎక్కువ ప్రకాశవంతంగాను చంద్రుడు కనిపించే అవకాశం వుంది.