ప్రశ్నించడమే పాపమైంది.. యూపీలో యువకుడ్ని చావబాదిన ఖాకీలు

తమకు ఎదురు చెప్పాడనే కోపంతో ఊగిపోయిన ఇద్దరు పోలీసులు ఓ యువకుణ్ని చావబాదిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ఒంటిపై ఖాకీ బట్టలున్నాయన్న అహంకారంతో వారు ఆ యువకుణ్ని విచక్షణా రహితంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నేపాల్ సరిహద్దు ప్రాంతమైన సిద్ధార్ధ్‌నగర్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. స్ధానికంగా బైక్ పై వస్తున్న ఓ యువకుణ్ని పోలీసులు అడ్డుకున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ రూల్స్‌కి సంబంధించి పోలీసులు వాహనాల తనికీ […]

ప్రశ్నించడమే పాపమైంది.. యూపీలో యువకుడ్ని చావబాదిన ఖాకీలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 13, 2019 | 2:13 PM

తమకు ఎదురు చెప్పాడనే కోపంతో ఊగిపోయిన ఇద్దరు పోలీసులు ఓ యువకుణ్ని చావబాదిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ఒంటిపై ఖాకీ బట్టలున్నాయన్న అహంకారంతో వారు ఆ యువకుణ్ని విచక్షణా రహితంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నేపాల్ సరిహద్దు ప్రాంతమైన సిద్ధార్ధ్‌నగర్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. స్ధానికంగా బైక్ పై వస్తున్న ఓ యువకుణ్ని పోలీసులు అడ్డుకున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ రూల్స్‌కి సంబంధించి పోలీసులు వాహనాల తనికీ నిర్వహించారు. ఇదే క్రమంలో తన బంధువైన చిన్నకుర్రాడితో సహా వస్తున్న బైక్‌పై వస్తున్న యువకుణ్ని పోలీసులు ఆపారు. అతడి వాహనానికి సంబంధించిన పత్రాలు చూపాలని ఆపడంతో ఆ యువకుడికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో యువకుడిపై ఒక్కసారిగ ఇద్దరు పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారు. అసభ్య పదజాలంతో తిడుతూ యువకుడి జుట్టు పట్టుకుని కొడుతూ కిందిక తోసేసి, వీపు మీదకి ఎక్కి, తొడకాలిపై బూటు కాలితో తొక్కేసి ఎస్సై వీరేంద్ర మిశ్రా తీవ్రంగా కొట్టాడు. కానిస్టేబుల్ మహేంద్ర ప్రసాద్ కూడా యువకుడి వీపుపై వెనుకనుంచి గట్టిగా తన్నుతూ కనిపించాడు. అయితే తనను ఎందుకు కొడుతున్నారని యువకుడు ప్రశ్నిస్తూ.. తాను ఏ తప్పు చేయలేదని వారిస్తున్నా అతడి మాటల్ని పోలీసులు పట్టించుకోలేదు. ఆ యువకుణ్ని కొడుతున్న సందర్భంలో అక్కడ చుట్టూ జనం ఉన్నా ఎవ్వరూ ఆపడానికి ప్రయత్నించ కుండా చూస్తూ ఉండిపోయారు. అయితే ఆ నిబలబడి ఉన్న వారిలో ఎవరో ఈ ఘటనను మొత్తం తమ మొబైల్ ఫోన్‌లో వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే దాడికి పాల్పడ్డ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.