ట్రంప్ గారూ ! ఎఫ్‌బీలో మీరు నెం.1 కారు.. సారీ !

ఫేస్‌బుక్‌లో తాను నెం. 1 అని, ప్రధాని మోదీ నెం.2  అని పేర్కొన్నందుకు ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బెర్గ్‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ నెల చివరి వారంలో తను భారత పర్యటన జరపబోతున్న సందర్భంలో తనను తాను గొప్ప అనిపించేందుకు ఈ సాధనాన్ని ఇలా వాడుకున్నారు. అయితే ఆయన చెబుతోంది తప్పని తేలింది. ‘2019 ట్విప్లొమసీ ర్యాంకింగ్స్’ ప్రకారం ప్రపంచ నాయకుల్లో మోదీ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారట. […]

ట్రంప్ గారూ ! ఎఫ్‌బీలో మీరు నెం.1 కారు.. సారీ !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 12:35 PM

ఫేస్‌బుక్‌లో తాను నెం. 1 అని, ప్రధాని మోదీ నెం.2  అని పేర్కొన్నందుకు ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బెర్గ్‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ నెల చివరి వారంలో తను భారత పర్యటన జరపబోతున్న సందర్భంలో తనను తాను గొప్ప అనిపించేందుకు ఈ సాధనాన్ని ఇలా వాడుకున్నారు. అయితే ఆయన చెబుతోంది తప్పని తేలింది.

‘2019 ట్విప్లొమసీ ర్యాంకింగ్స్’ ప్రకారం ప్రపంచ నాయకుల్లో మోదీ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారట. ఆయనకు 44 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ట్రంప్ గారు మాత్రం ఎక్కడో.. దూరాన.. 26 మిలియన్ల అభిమానులను కూడగట్టుకున్నారట. ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు  55 మిలియన్ల  ఫాలోవర్స్ ఉంటే, ఫుట్ బాల్ లెజెండ్లు లయొనిల్ మెస్సీ, క్రిస్టియానో రోనాల్డ్ లకు వరుసగా 90  మిలియనన్లు, 122.5 మిలియన్ల అభిమానులు ఉన్నట్టు లెక్క తేలింది. షకీరా ఫాలోవర్లు 100 మిలియన్లు. అందువల్ల.. ట్రంప్ ఎఫ్‌బీ‌లో.. ‘ నేను ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నానని ‘చేసిన ప్రకటన పూర్తిగా రాంగ్ అని వెల్లడవుతోంది.